- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Video : కారు బీభత్సం..ఐదుగురిపైకి దూసుకెళ్లిన కారు
గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా సిహోర్ నగరంలో హ్యుందాయ్ కారు బీభత్సం సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్న కూడా మద్యం తాగి వాహనాలు నడపడం, ఓవర్ స్పీడ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే లేటెస్ట్ గా ఓ కారు బీభత్సం సృష్టించి, ఐదుగురిపైకి దూసుకు వెళ్ళింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా సిహోర్ నగరంలో హ్యుందాయ్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో వచ్చిన కారు నియంత్రణ కోల్పోయి, మొదట రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ టెంపోను ఢీ కొట్టింది. ఆ తర్వాత ఐదుగురు పాదాచారులపైకి దూసుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మద్యం సీసాలు లభ్యం కావడం కలకలం రేపింది. డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా ? ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.






