- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీలిరంగు గుడ్లు పెడుతోన్న నాటుకోడి.. కారణమేంటో తెలుసా ?
సాధారణంగా బాయిలర్ కోళ్లు పెట్టే గుడ్లు తెలుపు రంగులో, నాటుకోళ్లు పెట్టే గుడ్లు గోధుమ రంగులో ఉంటాయన్న విషయం తెలిసిందే. బాయిలర్ గుడ్డు కంటే నాటుకోడిగుడ్డుకే గిరాకీ ఎక్కువ.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా బాయిలర్ కోళ్లు పెట్టే గుడ్లు తెలుపు రంగులో, నాటుకోళ్లు పెట్టే గుడ్లు గోధుమ రంగులో ఉంటాయన్న విషయం తెలిసిందే. బాయిలర్ గుడ్డు కంటే నాటుకోడిగుడ్డుకే గిరాకీ ఎక్కువ. కానీ.. ఒక కోడి నీలిరంగులో గుడ్లను పెడుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కర్ణాటకలోని దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా నల్లూరు గ్రామంలో ఈ వింత ఘటన వెలుగుచూసింది.
గ్రామానికి చెందిన సయ్యద్ అనే రైతు నాటుకోళ్లను పెంచుతుంటాడు. కోళ్లన్నింటికీ ఒకేరకమైన మేత పెడుతుండగా.. ఒక కోడి మాత్రం గుడ్లను నీలిరంగులో (Blue Egg) పెడుతుండటంతో అతను ఆశ్చర్యపోయాడు. స్థానికంగా ఈ ఘటన సంచలనం రేపగా.. ఆ కోడి పెడుతున్న గుడ్డును చూసి పశుసంవర్థకశాఖ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. గుడ్డు నీలి రంగులో ఉండటంతో దానిని కొనేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. కాగా.. రెండేళ్ల క్రితం కోడిని ఓ వ్యక్తి నుంచి రూ.20కి కొనుగోలు చేశానని, రెండ్రోజుల క్రితం వరకూ తెలుపురంగులోనే గుడ్లు పెట్టిన కోడి.. ఉన్నట్టుండి నీలిరంగులో గుడ్లు పెడుతోందని సయ్యద్ తెలిపాడు.
కోడి ఇలా నీలిరంగులో గుడ్డు పెట్టడానికి రీజన్.. బిలివర్డిన్ (Biliverdin) అనే పిగ్మెంట్ అని పశుసంవర్థకశాఖ వైద్యులు చెప్తున్నారు. కోడి ప్యాన్క్రియాస్ లో లేదా శరీరంలో ఈ పిగ్మెంట్ ఉత్పత్తి అవుతుంది. గుడ్డు షెల్ బయటి పొర రంగుపై దాని ప్రభావం ఉంటుంది. జెనెటిక్ కారణాలు, ఆహార సంబంధిత సమస్యల కారణంగా ఆ షెల్ కలర్ మారవచ్చంటున్నారు డాక్టర్లు. అన్నికోళ్లకు పెట్టిన ఆహారమే ఈ కోడికి పెడుతున్నారు కాబట్టి ఆహార సంబంధిత సమస్యలు కారణం కాకపోవచ్చని చెప్తున్నారు. కొన్ని కోళ్లజాతులు సహజంగానే బ్లూ, గ్రీన్ కలర్స్ లో గుడ్లు పెడతాయని ఈ కోడి కూడా మిశ్రమ జాతికి చెందినది కావచ్చని, జెనెటిక్ మ్యూటేషన్ కారణంగా నీలిరంగులో గుడ్డు ఉత్పత్తి అవుతుండవచ్చని భావిస్తున్నారు. ఈ కోడిగుడ్డుపై మరిన్ని అధ్యయనాలు చేస్తామని వైద్యులు తెలిపారు.






