పసికందును చాటలో వేసి బియ్యం చెరిగినట్టు చెరుగుతున్న బామ్మ.. అలా ఎగిరేస్తున్నావు ఎందుకే ముసలి నక్క అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు

by I. Sairam |

సాధారణంగా సోషల్ మీడియా(Social Media)లో చిన్న పిల్లల వీడియోలు ఇట్టే వైరల్ అయిపోతుంటాయి.

పసికందును చాటలో వేసి బియ్యం చెరిగినట్టు చెరుగుతున్న బామ్మ.. అలా ఎగిరేస్తున్నావు ఎందుకే ముసలి నక్క అంటూ ఏకిపారేస్తున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా సోషల్ మీడియా(Social Media)లో చిన్న పిల్లల వీడియోలు ఇట్టే వైరల్ అయిపోతుంటాయి. అయితే అందులో కొన్ని ఫన్నీవి ఉంటే.. మరికొన్ని షాకింగ్‌గా ఉంటాయి. ప్రస్తుతం ఆ కోవకు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఓ బామ్మ చాటలో పసికందును బయటకు తీసుకొచ్చి బియ్యం చెరిగినట్టు చెరుగుతుంది. అలాగే పైకి ఎగిరేస్తూ ఉంది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది.

ఇక దీన్ని చూసిన నెటిజన్లు రేయ్ ఎవర్రా మీరంతా అని, పసికందును చాటలో వేసి బియ్యం చెరిగినట్టు చెరుగుతున్న బామ్మ.. అలా ఎగిరేస్తున్నావు ఎందుకే ముసలి నక్క అంటూ ఏకిపారేస్తున్నారు. కాగా ఈ వయసులో చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా సంప్రదాయాలు అని పోతే వాళ్ల బ్రెయిన్ డామేజ్ అయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయి.

Instagram Link

Next Story