వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్.. స్కూటీ నడుపుతూ జూమ్ మీటింగ్‌ అంటెండ్ అయిన అమ్మాయి..

by Disha Web Desk 20 |
వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్.. స్కూటీ నడుపుతూ జూమ్ మీటింగ్‌ అంటెండ్ అయిన అమ్మాయి..
X

దిశ, ఫీచర్స్ : పెద్దనగరాల్లో నివసిస్తున్న, పనిచేసే వ్యక్తులు ఉద్యోగాల విషయంలో ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. అటు ఆఫీస్ కి వెళ్లాలన్నా, తిరిగి ఇంటికి రావాలన్నా ట్రాఫిక్ లో చాలా కష్టపడాల్సివస్తుంది. అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతుంది. ఇంతగా వైరల్ అయిన ఈ వీడియోలో అసలు ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోలో బెంగళూరులో ఉన్న భారీ ట్రాఫిక్‌లో అమ్మాయి స్కూటర్ తో పాటు ఇరుక్కుపోయింది. ఇంతలో జూమ్ మీటింగ్‌ అటెంట్ చేయాలని ఆఫీసు నుండి కాల్ వచ్చినట్టుంది. ఉద్యోగంలో ఎంత ఒత్తిడో చూడండి పాపం ఆ అమ్మాయి ట్రాఫిక్ మధ్యలోనే మీటింగ్‌లో చేరింది. ఇంతలో ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా అది ఇప్పుడు వేగంగా వైరల్ అవుతోంది.

అమ్మాయి స్కూటర్‌ పై కూర్చొని ఒక చేత్తో మొబైల్‌ను పట్టుకుని మీటింగ్ నోట్స్ తీసుకుంటున్నట్లు వీడియోలో చూపించారు. బెంగళూరు వాసులు ఎదుర్కొంటున్న రోజువారీ సవాళ్లను హైలైట్ చేస్తూ, దాని చుట్టూ ఉన్న ట్రాఫిక్ జామ్‌ను బహిర్గతం చేయడానికి కెమెరా కోణం మారుతుంది. కొన్ని సెకన్ల ఈ క్లిప్‌ని చూసి సోషల్ మీడియాలో జనాలు షాక్ అయ్యారు. ఇలాంటి దృశ్యాలు వార్తల్లోకి రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ సంవత్సరం, ఇదే విధమైన వీడియోలు చాలా బయటికి వచ్చాయి.



Next Story

Most Viewed