- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral video: గుర్రం, ఏనుగు మధ్య భీకర ఫైట్.. ఎవరు గెలిచారంటే?
జంతువులలో ఏనుగు ఎంతో బలశాలి. ఏనుగు ముందు ఎంతటి జంతువైన హడలిపోవాల్సిందే.

దిశ, వెబ్ డెస్క్: జంతువులలో ఏనుగు (Elephant) అంటే బలానికి మారుపేరు. అడవికి రాజుగా చెప్పే సింహాన్ని సైతం ఏనుగు హడలెత్తిస్తుంది! అలాంటిది ఓ చిన్న గుర్రం ఏనుగుకే చుక్కలు చూపించింది. గుర్రం దాడిని తట్టుకోలేక ఏనుగు పరుగులు పెట్టింది. అయినా విడచిపెట్టుకుండా గుర్రం ఏనుగును (Elephant, Horse Fight) వెంబడించింది. ఈ ఆసక్తికరమైన సంఘటన మధ్యప్రదేశ్‌లో (Madyapradesh) చోటుచేసుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా (Viral) మారాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లాంలోని పాల్సోడా ఫాటా సమీపంలో ఒకచోట తెల్ల గుర్రాన్ని కట్టి ఉంచారు. అయితే ఆ దారిలో అంబారీపై ఓ వ్యక్తి కూర్చుని ఉన్న పెద్ద ఏనుగు వచ్చింది. దగ్గరకు వచ్చిన ఆ ఏనుగును చూసి గుర్రం తాడు తెంపుకుని దూకుడుగా ఏనుగుపైకి దాడి చేసింది. ఏనుగుపై ఉన్న వ్యక్తి కర్రతో గుర్రాన్ని అదుపు చేయబోయినా.. ఆ దూకుడు మాత్రం తగ్గలేదు. ఆ దాడిని ఒక్క క్షణం కూడా ప్రతిఘటించలేకపోయిన ఏనుగు భయంతో అక్కడి నుంచి పరుగులు పెట్టింది. అక్కడున్న జనం గుర్రాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయితే ఆ గుర్రం దూకుడుగా ఏనుగును వెంబడించింది. ఇదంతా అక్కడున్న వారు మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యింది.






