- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిల్లాడిని సింహంపై కూర్చొపెట్టి ఫొటో తీయించేందుకు తండ్రి ప్రయత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
మనం ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అందాలను, ప్రత్యేకతలను జ్ఞాపకంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఫోటోలు, వీడియోలు తీసుకోవటం సర్వసాధారణం.

దిశ, వెబ్ డెస్క్: మనం ఎక్కడికైనా పర్యాటక ప్రదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అందాలను, ప్రత్యేకతలను జ్ఞాపకంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఫోటోలు, వీడియోలు (Photos, Videos) తీసుకోవటం సర్వసాధారణం. అందమైన దృశ్యాలు, ఆనంద క్షణాలు కెమెరాలో బంధించి, ఆ జ్ఞాపకాలను (Memories) భద్రపరచుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు అయితే తమ పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని పదిలంగా ఉంచుకోవాలనే ఆరాటంతో, వారిని ఫోటోలు తీసేందుకు ఉత్సాహపరుస్తుంటారు. వారు పెద్దయ్యాక ఈ చిత్రాలు చూపించి ఆహ్లాదకర క్షణాలను గుర్తు చేసుకోవాలని భావిస్తారు. కానీ, అదే ఆరాటం ఎప్పుడైనా హద్దులు దాటి పిల్లల భద్రతకే ప్రమాదంగా మారితే? ఓ ఫోటో కోసం పిల్లల భయం, బాధలను పట్టించుకోకుండా బలవంతంగా వాటిని తీయమంటూ ఒత్తిడి చేస్తే? తాజాగా వైరల్ (Viral) అయిన ఒక వీడియో ఈ ప్రశ్నలకు స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తోంది. తల్లిదండ్రుల బాధ్యత, వారి తీరు పై సమాజంలో తీవ్ర చర్చకు ఇది దారితీస్తోంది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ జూలో సింహం కూర్చుని ఉంది. అక్కడికి సందర్శనకు వచ్చిన ఓ తండ్రి తన కొడుకు ఆ సింహంపై కూర్చొపెట్టి ఫొటో తీయించాలని అనుకున్నాడు. అయితే, సింహంపై పిల్లాడి కూర్చొపెట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆ పిల్లాడు భయంతో ఏడుస్తూ కూర్చునేందుకు నిరాకరిస్తున్నాడు. ఇంతలో సింహానికి కోపం రావటంతో అది ఒక్కసారి అటుగా తిరిగింది. దీంతో తండ్రి భయపడి పిల్లాడిని తీసుకుని వచ్చేశాడు. ఈ వీడియోను Bad Parenting TV అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ పోస్ట్ చేయగా, క్షణాల్లో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తండ్రి ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. 'ఇది పిల్లల ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టడం' అంటూ కొందరు, 'ఇది పిల్లలపై మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. భయాన్ని పొగొట్టడం అంటే ఈ విధంగా బలవంతం పెట్టడం కాదు' అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.






