- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి-కూతురి అనుబంధం.. ఈ స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు (వీడియో)
ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి హీరో నాన్నే. ఆయన ఎంత కష్టపడతాడో పిల్లలకు తెలియకుండా పెంచుతాడు. పస్తులుండి కూడా పిల్లలకు కడుపునిండా భోజనం పెడతాడు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి హీరో నాన్నే. ఆయన ఎంత కష్టపడతాడో పిల్లలకు తెలియకుండా పెంచుతాడు. పస్తులుండి కూడా పిల్లలకు కడుపునిండా భోజనం పెడతాడు. ఆయన పడే కష్టం తన పిల్లలు పడకుండా ఉండాలని.. ఆయన జీవితాన్నే పణంగా పెడతారు. ఇలా తండ్రి గొప్పతనాన్ని చెబుతూ టాలీవుడ్(Tollywood)లోనూ అనేక సినిమాలు వచ్చాయి. సుకుమార్(Sukumar) తెరకెక్కించిన నాన్నకుప్రేమతో, త్రివిక్రమ్(Trivikram) తెరకెక్కించిన S% సత్యమూర్తి వంటి అనేక సినిమాలు తండ్రి గొప్పతనాన్ని చక్కగా వివరిస్తూ కన్నీళ్లు కూడా తెప్పించాయి. తాజాగా ఫాదర్‌కు సంబంధించిన మరో క్రేజీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ బాలిక తన తండ్రి గురించి చెబుతూ అందరికీ కంటనీరు పెట్టించింది.
‘నా తండ్రి ఒక తాపి మేస్త్రీ రోజూ ఇంటికొచ్చి నా చేతే నొప్పులు ఉన్నాయంటూ కాళ్లకు జండూబామ్ రాయించుకుంటాడు. ముగ్గురం కూతుళ్లం ఉన్నా.. రోజూ నన్నే పెట్టమని అడుగుతాడు. ఒక్కోరోజు నాకు కోపం వచ్చేది. కానీ ఒక్కోరోజు ఆయన కాళ్లకు వచ్చే రక్తం చూసి ఏడుపొచ్చేది. రక్తం చిందేలా ఆయన కష్టపడేది మా కోసమే. అలాంటి వ్యక్తిని చూస్తూ కూడా ఎలా నిర్లక్ష్యం చేయగలం. మంచిగా చదువుకొని ఆయనకు తప్పకుండా మంచిపేరు తీసుకొస్తాం’ అని ఏడుస్తూ ఆ చిన్నారి చెప్పిన మాటలు అందరినీ కదలించాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.






