Solar Power: సౌరశక్తితో నడిచే నీటి పంపు? ఓ రైతు కనుగొన్న వినూత్న పరికరం వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-03-24 07:11:39  IST  )

డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

Solar Power: సౌరశక్తితో నడిచే నీటి పంపు? ఓ రైతు కనుగొన్న వినూత్న పరికరం వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రైతులకు శ్రమను తగ్గించి లాభం చేకూర్చే పరికరాలు నేడు మార్కెట్లో అందుబాటులో వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కరెంట్ లేకుండా కేవలం (solar powered water pump) సౌరశక్తితో నడిచే నీటి పంపు కోసం ఓ రైతు వినూత్న పరికరాన్ని కనుగొన్నట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వీడియోలో చూపించిన ప్రకారం.. ఓ వ్యక్తి పంపు సెట్టు వద్ద ఓ స్టాండ్‌పై బాండీ వంటి వస్తువును ఎండ వేడిమి గ్రహించేలా దాన్ని అమరుస్తాడు. ఆ బాండీ వంటి వస్తువుకు అల్యూమినియం రేకు కాగితం పై పూతగా ఉన్నట్టు కనబడుతుంది. ఈ బాండీ నుంచి వచ్చే ఎనర్జీని గ్రహించేందుకు ఓ పరికరాన్ని వినియోగిస్తాడు. దానికి స్విచ్‌బోర్డు కనెక్ట్ అయి ఉంటుంది. మోటర్ పంపు వైర్ స్వీచ్ బోర్డు ప్లగ్‌లో పెట్టగానే బోరు నుంచి నీరు గల గల పారుతోంది. కరెంట్‌తో నడిచే నీటి పంపు మాదిరి నీరు వస్తోంది. ఆ బాండి వంటి వస్తువును స్టాండ్‌పై తొలగించినప్పుడు బోరు కూడా ఆగిపోతున్నట్లు వ్యక్తి వీడియో లో చూపించే ప్రయత్నం చేస్తాడు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే నెటిజన్లు రకరకాలుగా వీడియోపై రియాక్ట్ అవుతున్నారు. సౌరశక్తితో నడిచే నీటి పంపు వల్ల రైతులకు చాలా లాభాలు ఉంటాయని, కరెంట్ లేని మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పరికరం ఎంతో ఉపయోగపడుతుందని నెటిజన్లు భావిస్తున్నారు. కరెంట్ బిల్లు ఖర్చు సైతం ఉండదని కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు ఇది ఫేక్ వీడియోగా భావిస్తున్నారు. ఒక వేలా పరికరం నిజమే అయితే మాత్రం రైతులకు ఎంతో లాభమని నెటిజన్లు వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

Next Story