బంక్ వద్ద క్యూ..ట్రోల్ చేసిన‌ ఎల‌క్ట్రిక్ బైక‌ర్‌, వీడియో వైరల్

by velandi.Saikiran |

ట్రోల్ బంకుల దగ్గర క్యూ కడుతున్నారు వాహనదారులు. ఈ క్యూ లైన్ లో ఉన్న వాహనదారులను ట్రోలింగ్ చేశాడు ఓ ఎలక్ట్రిక్ బైకర్.

బంక్ వద్ద క్యూ..ట్రోల్ చేసిన‌ ఎల‌క్ట్రిక్ బైక‌ర్‌, వీడియో వైరల్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో ఇండియాలో ఎల్పీజీ, చమురు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే యుద్ధానికి తాత్కాలికంగా విరామం ప్రకటించినప్పటికీ కూడా ఇండియాలో పెట్రోల్ దొరకదని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం నేపథ్యంలో మంగళవారం ఉదయం నుంచి పెట్రోల్ బంకుల దగ్గర వాహనాలు క్యూ కడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే కొన్ని పెట్రోల్ బంకుల్లో ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావడం కారణంగా నో స్టాక్ బోర్డు పెడుతున్నారు. నిజంగా ఇండియాలో పెట్రోల్ కొరత ఉందని ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించలేదని కొంత మంది ప్ర‌చారం చేస్తున్నారు.

ఎల‌క్ట్రిక్ బైక‌ర్ సెటైరిక‌ల్ వీడియో వైర‌ల్

అయినప్పటికీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పెట్రోల్ బంకుల దగ్గర క్యూ కడుతున్నారు వాహనదారులు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ క్యూ లైన్ లో ఉన్న వాహనదారులను ట్రోలింగ్ చేశాడు ఓ ఎలక్ట్రిక్ బైకర్. పెట్రోల్ కోసం వేచి ఉన్న వాహనదారుల ముందు, తన ఎలక్ట్రిక్ స్కూటీ పై స్టైలిష్ గా చెక్కర్లు కొట్టాడు. మాకు మీలాగా క్యూ లైన్ లో నిలబడే బాధ లేదు.. ఎలాంటి టెన్షన్ లేకుండా హాయిగా ఎన్ని కిలో మీటర్లు అయినా తిరగవచ్చు అంటూ ఆ వాహనదారుల ముందు ఓవరాక్షన్ చేశాడు. ఈ సంఘటన గుజరాత్ లోని సూరత్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దీంతో ఈ సెటైరికల్ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసినా నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాటిని కొనుగోలు చేయడం బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story