దీనస్థితిలో కుక్క..ఆ డెడ్ బాడీ పక్కనే.. వీడియో చూస్తే కన్నీళ్లు రావాల్సిందే !

by velandi.Saikiran |

తమిళనాడులోని అధికారుల కారణంగా ఓ కుక్క మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయం తెలియక మరో కుక్క...

దీనస్థితిలో కుక్క..ఆ డెడ్ బాడీ పక్కనే.. వీడియో చూస్తే కన్నీళ్లు రావాల్సిందే !
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు... అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే.. ఓ కుక్క వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తోటి కుక్క మరణించడంతో... మరో కుక్క విశ్వాసంతో వ్యవహరించింది. ఈ వీడియోలో మనం దాన్ని గమనించవచ్చు.

ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో జరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని ఓ ప్రాంతంలో.. మున్సిపాలిటీ అధికారుల కారణంగా ఓ కుక్క మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయం తెలియక మరో కుక్క... తోటి కుక్కను లేపే ప్రయత్నం చేస్తోంది. కానీ అప్పటికి ఆ కుక్క మరణించింది.

ఇక ఈ రెండు కుక్కల వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసి నెటిజెన్స్.. ఎమోషనల్ అవుతున్నారు. ఆ కుక్కను చంపిన వాడికి కూడా అదే గతి పడుతుందని కొంతమంది దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు. కుక్కలను చంపకుండా ఊరు బయట వదిలేసి రావాలి కానీ ఇలా చంపకూడదని మరి కొంతమంది ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నారు. క్లిక్

Next Story