- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బట్టలు వాడుకొని రిటర్న్ పెట్టారు..ముఖాన కొట్టిన డెలివరీ ఏజెంట్!
జంట షూస్, బట్టలు బుక్ చేసుకుంది. రిటర్న్ పెట్టుకునే గడువు ఉన్నంత వరకు వాటిని వాడేసారు. ఆ తర్వాత అవి మేం బుక్ చేసిన

దిశ, వెబ్ డెస్క్ : ఆన్లైన్ షాపింగ్ ఈ మధ్యకాలంలో విపరీతంగా చేస్తున్నారు. మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆన్లైన్ షాపింగ్ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోయింది. దానికి తగ్గట్టుగానే అమెజాన్ లాంటి కంపెనీలు ఆఫర్లు కూడా పెడుతున్నాయి. ఆ ఆఫర్లు చూసి, జనాలు ఎగబడి ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు. నచ్చకపోతే రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ కూడా ఇస్తున్నాయి ఈ-కామర్స్ కంపెనీస్. అయితే ఈ రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ను కొంతమంది సక్రమంగా సద్వినియోగం చేసుకుంటే, మరికొంతమంది మాత్రం దాన్ని పక్క దారి పట్టిస్తున్నారు. ఒక వస్తువును వారం రోజుల పాటు వాడి, అవసరం తీరాక మళ్లీ రిటర్న్ పెట్టి కొత్తది తెచ్చుకుంటున్నారు.
ఇలా చాలా సంఘటనలు బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఓ జంట షూస్, బట్టలు బుక్ చేసుకుంది. రిటర్న్ పెట్టుకునే గడువు ఉన్నంత వరకు వాటిని వాడేసారు. ఆ తర్వాత అవి మేం బుక్ చేసిన ఐటెమ్స్ కాదని, రిటర్న్ పెట్టేశారు. అయితే డెలివరీ ఏజెంట్ బాయ్... వాటిని వాడినట్లు గుర్తించాడు. ఇవి మీరు వాడారు.. రిటర్న్ చెల్లదని కస్టమర్లకు చెప్పేశాడు. మేం వాడలేదని కస్టమర్లు ఎదురు తిరిగారు. దీంతో చేసేదేమీ లేక ఆ వస్తువులను వాళ్ళ ముఖాన కొట్టేసి వెళ్లిపోయాడు డెలివరీ ఏజెంట్ బాయ్. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ నిన్నటి నుంచి వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ షాక్ అవుతున్నారు. బట్టలు వాడుకొని, రిటర్న్ పెట్టే మనుషులు కూడా ఉన్నారని షాక్ అవుతున్నారు. అలాంటి వాళ్లకు ఆ డెలివరీ బాయ్ తగిన బుద్ధి చెప్పాడని కామెంట్స్ పెడుతున్నారు. క్లిక్






