- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Viral : ఆహారం టేస్టీగా ఉండట్లేదు నాన్నా అన్నందుకు.. ఆ తండ్రి మనసు కరిగిపోయింది. తర్వాత ఏం చేశాడంటే..
హాస్టల్ ఫుడ్ టేస్టీగా ఉండట్లేదు నాన్నా.. తినలేకపోతున్నానంటూ కూతురు కంటతడి పెట్టగానే.. ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. వెంటనే ఏం చేశాడంటే..

దిశ, ఫీచర్స్ : అప్పుడప్పుడూ ప్రపంచంలో ఏదో ఒక మూనల చోటు చేసుకునే కొన్ని సంఘటనలు మనల్ని కదిలిస్తుంటాయి. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇంకొన్ని మానవ సంబంధాల్లోని ప్రేమానురాగాలను నిదర్శనంగా నిలుస్తుంటాయి. అలాంటి ఒక సంఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ తండ్రి తన కూతురికోసం ఏం చేశాడో తెలసి అందరూ ఆశ్చర్యపోతన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
పేరు లీ బింగ్డి (Li Bingdi). చైనాలోని జిలిన్ నార్మల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉంటూ సెకండియర్ చదువుతోంది. అయితే అక్కడ ప్రతిరోజూ హాస్టల్‌లో విద్యార్థులకు పెట్టే ఫుడ్ ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో చేసినట్లు రుచిగా ఉండట్లేదని బాధపడేది. ఒక రోజు ఇదే విషయం తన తండ్రి లీ బిన్ (Li Bin)తో చెప్పింది. ‘నాకు హాస్టల్ ఫుడ్ రుచిగా అనిపించడం లేదు నాన్నా.. తినలేకపోతున్నా’ అంటూ కంటతడి పెట్టింది. అది చూసి ఆ తండ్రి మనసు కరిగిపోయింది. తన కూతురు సరిగ్గా తినలేకపోతున్నందుకు చాలా బాధపడ్డాడు. ఎలాగైనా ఈ సమస్యకు చెక్ పెట్టాలనుకున్నాడు. ఇంకేముంది తియాన్జిన్‌లోని బార్బెక్యూ రెస్టారెంట్‌లో జాబ్ చేస్తున్న అతను వెంటనే ఉద్యోగానికి రిజైన్ చేశాడు.
కేవలం తన కూతురుకు ఇష్టమైన రుచిగల ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఫ్రైడ్ రైస్, నూడుల్స్ సహా ఇతర రుచికరమైన వంటలను నేర్చుకుని, ఆమె చదువుతున్న లిజిన్ ప్రావిన్స్‌లోని కాలేజీ ప్రాంగణంలో చిన్న ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేశాడు లీ బింగ్డి. ప్రతిరోజూ తన కూతురు హాస్టల్లో కాకుండా తన వద్దకు వచ్చి కడుపు నిండా తింటుంటే చూసి సంబరపడసాగాడు. కేవలం కూతురికోసం మాత్రమే ఫుడ్‌స్టాల్ ఏర్పాటు చేసినప్పటికీ, ఇతర విద్యార్థులు, స్థానికులు కూడా రావడం ప్రారంభించడంతో ఆదాయం కూడా రావడం ప్రాంరంభమైంది. ఇటు కూతురి కోరిక నెవవేరడంతోపాటు అటు జీవనోపాధి కూడా లభించింది. ఈ వార్త సోషల్ మీడియాల్ వైరల్ అవుతుండగా.. ‘తండ్రీ కూతుళ్ల అనుబంధమంటే ఇదే.. ఎంతైనా తండ్రి ప్రేమ చాలా గొప్పది’ అంటూ తెగ పొగిడేస్తున్నారు పలువురు.






