అద్భుతం.. స్మార్ట్ హౌస్ కాదు, హార్ట్ హౌస్ ఇది! చెట్టు కొమ్మల్లో చిన్నారుల కలల నివాసం!

by Yella Dhawani Reddy |

గత కొంత కాలంగా ట్రీ–హౌజ్, బోట్‌–హౌజ్‌‌లు చాలా ట్రెండ్ అవుతున్నాయి.

అద్భుతం.. స్మార్ట్ హౌస్ కాదు, హార్ట్ హౌస్ ఇది! చెట్టు కొమ్మల్లో చిన్నారుల కలల నివాసం!
X

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా ట్రీ–హౌజ్ (Tree house), బోట్‌–హౌజ్‌‌లు (Boat house) చాలా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా (Social media) వచ్చాక వీటికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. తరచూగా టూర్లకు వెళ్లేవారైతే ఖచ్చితంగా అక్కడ ట్రీ-హౌజ్, బోట్-హౌజ్ విడిదిని ఎక్స్‌పియరెన్స్ చేయాలని కోరుకుంటారు. ఇలాగే ఈ చిన్నారులకు కూడా ట్రీ హౌజ్ అనుభూతి పొందాలనుకున్నారు. అందుకోసం ఎక్కడికో వెళ్లటం ఎందుకు అనుకున్నారు కావచ్చు.. తమ ఇంటి సమీపంలోని ఓ చెట్టుపై తమ డ్రీమ్ ట్రీ హౌజ్‌ను (Dream tree house) నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారింది.

రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో చిన్నారులు తమ ఇంటి సమీపంలో ప్రత్యేకమైన ట్రీహౌస్‌ను నిర్మించుకున్నారు. వారు ఆడుకునేందుకు నిర్మించుకున్న ఈ డ్రీమ్ ఇళ్లు చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంది. చెట్ల మధ్యలో చెక్కలు, తాడు, పాత వస్తువులు ఉపయోగించి ఈ ఇళ్లు నిర్మించారు. ఇంటిలోకి ప్రవేశించేందుకు ఓ మెట్ల మార్గంగా ఓ నిచ్చెనను కూడా ఏర్పాటు చేశారు. India Cultural Hub అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ప్రకృతితో మమేకమైన ఇళ్లు నెటిజన్ల మనసును దోచుకుంటుంది.

Next Story