- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మొదటి ప్రపంచ యుద్ధం నాటి నౌక శిథిలం.. బ్రిటన్ వ్యక్తి సొంతం.. ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 1918 మధ్యకాలంలో జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: మొదటి ప్రపంచ యుద్ధం (First World War) 1914 నుంచి 1918 మధ్యకాలంలో జరిగింది. ఈ యుద్ధంలో లక్షలాది మంది సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. నేటికీ అనేక కుటుంబాల్లో ఇది చేదు జ్ఞాపకంగా మిగిలి ఉంది. ఇప్పుడు ఈ విషయాలను ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందంటే.. బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి మొదటి ప్రపంచ యుద్ధానికి చెందిన ఓ అరుదైన వస్తువును కేవలం రూ.34,000కే సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరీ ఆ విశేషాలేంటో తెలుసుకుందామా.
బ్రిటన్‌కు చెందిన డామ్ రాబిన్సన్ (Dom Robinson) అనే వ్యక్తి చిన్నతనం నుంచి సముద్ర గర్భంలో శిథిలమైన వస్తువుల గురించి తెలుసుకోవటం, సేకరించటం ఆసక్తిగా ఉండేది. ఆ ఇష్టంతో తాను ప్రొఫిషనల్ డైవర్‌గా మారి గత కొన్నేళ్లలో సుమారు 20-25 ఓడ శిథిలాలను గుర్తించాడు. అంతేకాదు, వాటి గురించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలు తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు ఫేస్‌బుక్‌లో మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా 1917 నవంబర్ 27న మునిగిపోయిన ఎస్ఎస్ అల్మండ్ బ్రాంచ్ అనే ఓడ శిథిలం విక్రయానికి సంబంధించిన ప్రకటనను చూశాడు. దాన్ని సొంతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
వెంటనే రూ.34,000 వెచ్చించి ఆ ఓడ శిథిలాన్ని సొంతం చేసుకున్నాడు. అనంతరం స్వయంగా డైవింగ్ చేస్తూ వెళ్లి తన ఓడ శిథిలాన్ని పరిశీలించాడు. అది 3,300 టన్నుల బరువు, 330 అడుగుల పొడవు ఉన్న కార్గో నౌక అని తెలిపాడు. కార్న్‌వాల్ తీరంలో జర్మన్ సబ్‌మెరైన్ దాడిలో మునిగిపోయినట్లు వివరించాడు. తనకు ఇలా శిథిలాలను వెలికితీయటం అంటే ఇష్టమని, ప్రతి శిథిలానికి ఒక కథ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం తాను సొంతం చేసుకున్న శిథిలంలో డైవింగ్ చేస్తున్నప్పుడు అది తనదనే సొంత భావన భిన్నమైన అనుభూతిని ఇచ్చిందన్నాడు. అయితే, ఇది కొనుగోలు చేయటం తన భార్య సుజీకి అస్సలు ఇష్టంలేదని, డబ్బులు వృథా చేస్తున్నానని కోపడినట్లు చెప్పుకొచ్చాడు.






