పుట్టిన మూడు రోజులకే హాస్పిటల్ బెడ్‌పై పాకుతున్న చిన్నారి.. వీడియో వైరల్

by Disha Web Desk 6 |
పుట్టిన మూడు రోజులకే హాస్పిటల్ బెడ్‌పై పాకుతున్న చిన్నారి.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: జన్మించిన మూడు రోజులకే హస్పిటల్ బెడ్‌పై చిన్నారి తల ఎత్తి పాకుతున్న సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అది చూసిన తల్లి ఈ విషయాన్ని తెలుపుతూ ఓ వీడియో షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. పెన్సిల్వేనియా కు చెందిన US నివాసి 34 ఏళ్ల సమంత అనే మహిళకు ఆడపిల్ల జన్మించింది. చిన్నారి నైలా పుట్టిన మూడు రోజులకే తలపైకి ఎత్తి బెడ్‌పై పాకడం సమంతని ఆశ్చర్యానికి గురి చేసిందని వీడియో రికార్డ్ చేసింది. కూతురు చేసిన ఫీట్లు తన భర్త నమ్మడనే సందేహంతో వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నారికి మూడు నెలల వయసు. అయితే అందరి చిన్నారుల కంటే భిన్నంగా ఆమె ఎదుగుతోందట. త్వరలోనే నడిచేస్తుందని తల్లి అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.



Next Story