80 ఏళ్ల భర్త.. 20 ఏళ్ల భార్య.. మొదటి బిడ్డకు జన్మ..

by Sujitha Rachapalli |

ప్రేమ గుడ్డిది అని అంటారు.. ప్రేమకు కులం..మతం.. ప్రాంతం.. భాష.. ఇవేవీ లేవని చెప్తారు. కొత్తగా ప్రేమకు వయసు కూడా అడ్డు రాదని చాలా సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

80 ఏళ్ల భర్త.. 20 ఏళ్ల భార్య.. మొదటి బిడ్డకు జన్మ..
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమ గుడ్డిది అని అంటారు.. ప్రేమకు కులం..మతం.. ప్రాంతం.. భాష.. ఇవేవీ లేవని చెప్తారు. కొత్తగా ప్రేమకు వయసు కూడా అడ్డు రాదని చాలా సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 80 ఏళ్ల ఫ్రాంక్.. 20ఏళ్ల జెస్సికా.. ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వయసు తేడా గురించి ఆలోచించకుండా.. మనసులతో తమ బంధానికి ముడిపెట్టారు. ఇందుకు కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందుకు సాగారు. ఇక ఈ జంట లైఫ్‌లో న్యూ చాప్టర్ చూడబోతుంది.

అవును.. వీరిద్దరు కలిసి తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. అయితే 80ఏళ్ల వయసులో ఫ్రాంక్ తండ్రి కావడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ముసలాయన మీద ఆస్తి ఎంతుంది? పెన్షన్ వస్తుంది? పైసల కోసమే కదా ఆమె పెళ్లి చేసుకుంది? దయచేసి ఇలాంటి ఫీడ్ చూపించకండిరా బాబు.. అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

Next Story