టాయిలెట్ ట్యాంక్ లో 70కి పైగా పాములు.. వణుకుపుట్టాల్సిందే ?

by velandi.Saikiran |   (  Updated:2025-05-22 22:04:03  IST  )

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ... ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి

టాయిలెట్ ట్యాంక్ లో 70కి పైగా పాములు.. వణుకుపుట్టాల్సిందే ?
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ... ఉంటాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా... ఓ టాయిలెట్ ట్యాంక్ లో ఏకంగా 70 కి పైగా పాములు ప్రత్యక్షమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోని చూసినవారు... వణికిపోతున్నారు.

అయితే టాయిలెట్ ట్యాంక్ లో 70 కి పైగా పాములు ఉన్న సంఘటన... ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ( UP )మహారాజ్ గంజి జిల్లా ( Maharaj Ganji District )... హరది డాలి గ్రామంలో ... చోటుచేసుకుంది. ఈ గ్రామానికి సంబంధించిన వీరేంద్ర గుప్తా... అనే వ్యక్తి తన టాయిలెట్ ట్యాంకును క్లీన్ చేయించాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే... ఈ ట్యాంక్ మూత తీయగానే 70 కి పైగా పాములు ప్రత్యక్షమయ్యాయి.

దీంతో ఒక్కసారిగా అక్కడి నుంచి అరుస్తూ పరుగులు పెట్టాడు ఇంటి యజమాని వీరేంద్ర గుప్తా. అనంతరం గ్రామస్తులకు సమాచారం ఇచ్చి దానికి సంబంధించిన వీడియోను కూడా క్యాప్చర్ చేశాడు. అయితే.. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక చేసేదేమీ లేక అధికారులకు సమాచారం ఇచ్చి.... ఆ పాముల సమస్య నుంచి బయటపడ్డాడు. వాటిని పట్టుకున్న అధికారులు అడవిలో వదిలేశారు. ఇప్పుడు ఈ సంఘటన వైరల్ గా మారింది.

Next Story