- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాట్‌జీపీటీని నమ్ముకుని ఆస్పత్రిపాలైన 60 ఏళ్ల వ్యక్తి
అమెరికాలోని (America) న్యూయార్క్‌కు (NewYork) చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి తన ఆహారంలో ఉప్పును తొలగించాలని భావించాడు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మనం ఆధునిక యుగంలో జీవిస్తున్నాం. ఇక ఈ యుగంలో టెక్నాలజీ మన జీవితంలో అంతర్భాగమైంది. ప్రతి చిన్న సమస్యకు టెక్నాలజీపై ఆధారపడటం సర్వసాధారణంగా మారిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) రాకతో ఈ ధోరణి మరింత తీవ్రమైంది. విద్య, వైద్య, ఉద్యోగం, ఆరోగ్యం.. ఇలా దేనికి సంబంధించినదైన సరే ఏఐని ఆశ్రయిస్తున్నారు. అయితే, ఈ సాంకేతిక పురోగతి సౌలభ్యంతో పాటు ప్రమాదాలను కూడా తెచ్చిపెడుతోంది. ఇందుకు సంబంధించిన వార్తలు కూడా మనం చూస్తునే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఓపెన్ ఏఐ (OpenAI) సంస్థకు చెందిన చాట్‌జీపీటీని (ChatGPT) నమ్ముకుని ఆస్పత్రిపాలయ్యాడు.
అమెరికాలోని (America) న్యూయార్క్‌కు (NewYork) చెందిన ఓ 60 ఏళ్ల వ్యక్తి తన ఆహారంలో ఉప్పును తొలగించాలని భావించాడు. ఇందుకోసం చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. అది సోడియం క్లోరైడ్‌ను (ఉప్పు) సోడియం బ్రోమైడ్‌తో భర్తీ చేయొచ్చని సలహా ఇచ్చింది. దీంతో అతడు ఉప్పు మానేసి, దానికి బదులు సోడియం బ్రోమైడ్ వాడటం ప్రారంభించాడు. మూడు నెలలు సోడియం బ్రోమైడ్ వాడే సరికి అతడు తీవ్రమైన అనారోగ్య పాలయ్యాడు. ఇక మూడు వారాల చికిత్స అనంతరం అతడి ఆరోగ్యం కొలుకోవటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయితే, అతడికి గతంలో ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినప్పటికీ, ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోనే అతడి పరిస్థితి దారుణంగా క్షీణించటం వైద్యులు గమనించారు.
అతడు ఆస్పత్రిలో చేరినప్పుడు.. తీవ్రమైన దాహం, కండరాల సమన్వయ సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు, తీవ్రమైన పారానాయిడ్, హాలుజీనేషన్స్ వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వైద్యులు అతడిని ప్రశ్నించగా, తానే ఇంట్లో స్వయంగా నీటిని డైల్యూట్ చేసుకుంటున్నానని, చాలా కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నానని తెలిపాడు. ఇది విని వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సోడియం క్లోరైడ్‌ను భర్తీ చేసేందుకు సోడియం బ్రోమైడ్ తీసుకోవటంతో అతడికి బ్రోమిజం (Bromism) వచ్చినట్లుగా వైద్యులు గుర్తించారు. ఇక చికిత్సలో భాగంగా అతడి వైద్యులు నీరు ఇచ్చిన తాగేందుకు నిరాకరించాడు. దీంతో వైద్యులు అతడికి శరీర ద్రవాలు (fluids), ఎలక్ట్రోలైట్లుతో చికిత్స అందించారు. అనంతరం అతడిని మానసిక వైద్యచికిత్స విభాగానికి తరలించారు. ఎందుకంటే.. చికిత్స మధ్యలో ఒకసారి ఆసుపత్రి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.
కాగా, సోడియం బ్రోమైడ్ కూడా చూసేందుకు టేబుల్ సాల్ట్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ, ఇది పూర్తిగా భిన్నమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. దీన్ని 1900 కాలంలో కొన్ని ఔషధాల తయారీలో ఉపయోగించేవారు. ప్రస్తుతం ఎక్కువగా పారిశ్రామిక ప్రయోజనాల కోసం వాడుతున్నారు. దీనిని అధికంగా తీసుకోవడం అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక సోడియం బ్రోమైడ్ ఉప్పుకు సరైన ప్రత్యామ్నాయం కాదు. చాట్‌జీపీటీ సలహాలను గుడ్డిగా పాటిస్తే ఎలాంటి సమ్యలు ఎదురవుతాయో ఇది ఒక ఉదాహరణంగా చెప్పవచ్చు.






