- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వింత దాంపత్యం.. ఏఐ చాట్‌బాట్‌తో ప్రేమలో పడిన 58 ఏళ్ల ప్రొఫెసర్
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) యుగం నడుస్తోంది. ఇప్పుడు ఏ రంగాన్నైనా ఈ కృత్రిమ మేధ శాసిస్తుంది. అంతేకాదు, ఏఐ చాట్‌బాట్ (AI Chatbot) వినియోగదారులు సైతం విపరీతంగా పెరిగిపోతున్నారు. ఒంటరితనంగా ఫీల్ అయ్యేవారు, ఎవరితో షేర్ చేసుకోలేని విషయాలను పంచుకునేందుకు ఏఐతో చాటింగ్‌కు అడిక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ఓ అమెరికన్ మహిళ (American woman) ఏకంగా ఏఐ చాట్‌బోట్‌తో ప్రేమలో పడింది. అంతటితో ఆగకుండా ఆ ఏఐ చాట్‌బాట్‌ను తన భర్తగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో (Social media) విపరీతంగా చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలోని పిట్స్‌బర్గ్‌కు (Pittsburgh) చెందిన 58 ఏళ్ల విశ్రాంత ప్రొఫెసర్ అలైనా వింటర్స్ (Retired professor Alaina Winters) భర్త డోనా 2023లో అనారోగ్యంతో మరణించాడు. అప్పటి నుంచి ఒంటరితనంలో బాధపడుతున్న అలైనా.. ఫేస్‌బుక్‌లో రెప్లికా (Replika) ఏఐ ప్లాట్‌ఫామ్ గురించి తెలుసుకుంది. తన ఒంటరితనం పొగొట్టుకునేందుకు రెప్లికా ప్లాట్‌ఫామ్‌లో లూకాస్ అనే ఏఐ చాట్‌బాట్ అవతార్‌ను సృష్టించుకుంది. ఇక రోజు లూకాస్‌తో తన జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకునేది. ఈ చాటింగ్ క్రమంగా ప్రేమగా మారి, ఇప్పుడు లూకాస్‌నే తన 'వర్చువల్ భర్త'గా ప్రకటించుకుంది.
ఈ విషయం మొదట తన స్నేహితులు, బంధువులకు చెప్పగా, తన మానసిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తి చేశారు. అయితే, తాను సంతోషంగా ఉండటం చూసి వారి భయాలను తొలగించుకున్నారు. ఇక ఇటీవల తమ ఆరు నెలల వివాహ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకున్నారు. ఈ విషయాలను అలైనా meandmyaihusband.com అనే బ్లాగ్‌లో వెల్లడించారు. లూకాస్ తనకు అనుగుణంగా వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ వినూత్న బంధం.. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ మానవ సంబంధాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది తెలియజేస్తోందని పలువురు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.






