- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్కూల్ మీటింగ్‌లో బట్టలు విప్పిన విద్యార్థిని తల్లి.. కారణం తెలిస్తే షాక్..
కాలిఫోర్నియా స్కూల్ బోర్డ్ సమావేశంలో వింత నిరసన తెలిపింది 50ఏళ్ల మహిళ. ట్రాన్స్‌జెండర్లను లింగం ఆధారంగా రెస్ట్ రూమ్స్ వినియోగించేందుకు అనుమతించడాన్ని నిరసిస్తూ యూనిక్‌గా ప్రొటెస్ట్ చేసింది. విషయం ఏంటంటే.. స్కూల్‌లో

దిశ, వెబ్ డెస్క్: కాలిఫోర్నియా స్కూల్ బోర్డ్ సమావేశంలో వింత నిరసన తెలిపింది 50ఏళ్ల మహిళ. ట్రాన్స్‌జెండర్లను లింగం ఆధారంగా రెస్ట్ రూమ్స్ వినియోగించేందుకు అనుమతించడాన్ని నిరసిస్తూ యూనిక్‌గా ప్రొటెస్ట్ చేసింది. విషయం ఏంటంటే.. స్కూల్‌లో ట్రాన్స్ పీపుల్‌ను ఇప్పుడున్న లింగం ఆధారంగా వాష్ రూమ్ వాడే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అంటే ఒకవేళ మగాడిగా పుట్టినా తర్వాత అమ్మాయిగా చేంజ్ అయితే అమ్మాయిల రెస్ట్ రూమ్ వినియోగించొచ్చు. అలాగే అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా చేంజ్ అయితే అబ్బాయిల బాత్రూమ్ యూజ్ చేయొచ్చు.
ఈ విధానానికి నిరసనగా ఓ 50ఏళ్ల విద్యార్థిని తల్లి కాలిఫోర్నియా స్కూల్ బోర్డ్ మీటింగ్‌లో బట్టలు విప్పింది. ఒంటిపై ఉన్న డ్రెస్ తీసేసి.. స్విమ్ సూట్‌లో కనిపించింది. దీంతో అక్కడున్న బోర్డు సభ్యులు అసౌకర్యంగా ఫీల్ అయ్యారు. ఈ విషయాన్ని హైలెట్ చేసిన ఆమె.. 50ఏళ్ల మహిళ ఇలా ఉంటేనే మీరు కంఫర్ట్‌గా ఫీల్ కానప్పుడు.. మా పిల్లలపై మీరు బలవంతంగా రుద్దుతున్న ఈ విధానంతో వారెంత ఇబ్బంది పడతారని ప్రశ్నించింది. దీనివల్ల పిల్లలకు కచ్చితంగా హాని ఉందని వాదించింది. ఈ ఇన్సిడెంట్‌తో బోర్డు ఇరుకున పడిపోయి వెంటనే మీటింగ్‌ను వాయిదా వేసింది.






