- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రాణం మీదకు తెచ్చిన తల్లి నిర్లక్ష్యం..మూడవ ఫ్లోర్ కిటికీ గ్రిల్‌లో చిక్కుకున్న చిన్నారి!
తల్లిదండ్రుల నిర్లక్ష్యం 4ఏళ్ల చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పూణేలోని గుజార్ నింబాల్కర్వాడి ప్రాంతంలోని సోనావానే భవనంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది.

దిశ, వెబ్ డెస్క్: తల్లిదండ్రుల నిర్లక్ష్యం 4ఏళ్ల చిన్నారి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పూణేలోని గుజార్ నింబాల్కర్వాడి ప్రాంతంలోని సోనావానే భవనంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. కాగా తల్లి తన పెద్ద కూతురును స్కూల్ లో దింపేదుకు వెళ్లగా చిన్నకూతురును ఇంట్లోనే ఉంచి తాలం వేసింది. ఏం జరిగిందో కానీ ప్రమాదవశాత్తు చిన్నారి కిటికి నుండి బయట వైపు గ్రిల్ కు చిక్కుకుని వేలాడుతూ పక్కన అపార్ట్‌మెంట్ వాళ్లకు కనిపించింది.
చిన్నారి తల కిటికీలో ఇరుక్కోగా మిగితా శరీరం అంతా బయట వైపుకు వేళాడుతూ ఏడ్వటం మొదలు పెట్టింది. పాప ఏడుపు పక్కింటివాళ్లకు వినిపించడంతో వెంటనే కిందకు దిగి చూశారు. సొసైటీ వాళ్లకు చెప్పడంతో అంతా అక్కడకు చేరకుని ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారిని రక్షించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సైతం వీడియో చూసి బయపడిపోతున్నారు. ఏమీ తెలియని పిల్లలను ఇంట్లో వదిలి వెళితే ఎంత ప్రమాదమో ఈ వీడియో నిదర్శనం అని కామెంట్లు పెడుతున్నారు.






