- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
50 ఏళ్ల ప్రియురాలి కోసం టవరెక్కిన 30 ఏళ్ల యువకుడు
ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కంటే 20 ఏళ్లు పెద్దదైన 50ఏళ్ల ప్రియురాలి కోసం 30ఏళ్ల యువకుడు టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. యూపీకి చెందిన చందన్ అనే యువకుడు నగరంలోని 200 అడుగుల టవర్ పైకి ఎక్కి హల్ చల్ చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తన కంటే 20 ఏళ్లు పెద్దదైన 50ఏళ్ల ప్రియురాలి కోసం 30ఏళ్ల యువకుడు టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. యూపీకి చెందిన చందన్ అనే యువకుడు నగరంలోని 200 అడుగుల టవర్ పైకి ఎక్కి హల్ చల్ చేశాడు. తన ప్రియురాలు ఫోన్ ఎత్తడంలేదని అందుకే తాను ముంబై వచ్చానని పోలీసుకు స్వయంగా తానే ఫోన్ చేసి చెప్పాడు. తన ప్రియురాలితో మాట్లాడించకపోతే టవర్ పై నుండి దూకేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
ఆమెను పిలిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో టవర్ పై నుండి కిందకి దిగాడు. కిందికి దిగిన తరవాత పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఇక చందన్ అతడి ప్రియురాలి మధ్య 20 ఏళ్ల గ్యాప్ ఉండగా ఇప్పటికే ఆమెకు నలుగురు సంతానం కూడా ఉన్నారు. ప్రస్తుం చందన్ టవర్ ఎక్కి ఆందోళన చేపట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. నలుగురు పిల్లల తల్లితో ప్రేమ ఏంటిరా అంటూ మండిపడుతున్నారు. పోలీసులు ఇలాంటి వాళ్లను కాపాడకపోవడమే మంచిదని కామెంట్ చేస్తున్నారు.






