గంజాయి అమ్ముతున్న ఐదుగురు వ్యక్తుల అరెస్ట్

by Taduka Kalyani |

గంజాయి అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను మోకిలా పోలీసులు పట్టుకున్నారు.

గంజాయి అమ్ముతున్న ఐదుగురు వ్యక్తుల అరెస్ట్
X

దిశ, శంకర్ పల్లి : గంజాయి అమ్ముతున్న ఐదుగురు వ్యక్తులను మోకిలా పోలీసులు పట్టుకున్నారు. మోకిలా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారంగా ఒరిస్సా రాష్ట్రంలో గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్ నగరంలో కార్మికుల ఉండే ప్రాంతాల్లో గంజాయిని అమ్ముతుండగా విశ్వసనీయ సమాచారం మేరకు నార్సింగ్ మున్సిపల్ పరిధిలోని ( శంకర్పల్లి మండలం)ఇంద్రారెడ్డి నగర్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి అమ్ముతున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి 8.75 కిలోల గంజాయి తోపాటు ఐదు మొబైల్ ఫోన్లు ఒక హోండా బైక్, రూ. 4200 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

Next Story