- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
3 నెలలుగా ఫ్రూట్ జ్యూస్ డైట్.. చివరికి ఏం జరిగిందంటే?
ఫ్రూట్ జ్యూస్ డైట్ (Fruit Juice Diet) ఓ యువకుడి ప్రాణాలు తీసిన ఘటన తమిళనాడు (Tamilnadu)లో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఫ్రూట్ జ్యూస్ డైట్ (Fruit Juice Diet) ఓ యువకుడి ప్రాణాలు తీసిన ఘటన తమిళనాడు (Tamilnadu)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారి జిల్లా కొలచెల్‌కు చెందిన శక్తీశ్వరన్ (Shaktheeswaran) గత మూడు నెలల నుంచి బాడీ షేప్ రావడం కోసం వ్యాయామం చేయడం ప్రారంభించాడు. యూట్యూబ్‌లో చూసి ఎలాంటి ఘన పదార్థాలు ఆహారంగా తీసుకోకుండా ఫ్రూట్ జ్యూస్ డైట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. గురువారం శక్తీశ్వరన్ ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందని కుటుంబ సభ్యలకు తెలిపాడు. అనంతరం స్పృహ కోల్పోయిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే ప్రణాలో కోల్పోయాడు. ప్రస్తుతం వైద్యులు శక్తీశ్వరన్ పోస్ట్‌మార్టం (Postmortem) నివేదికను పరిశీలిస్తున్నారు. అసలు అతడి మరణానికి ఖచ్చితమైన కారణాలను కనిపెట్టేందుకు పరీక్షలు నిర్వహించారు. ఊపిరి ఆడకపోవడం వల్ల.. లేక డైట్ కంట్రోల్‌తో శక్తీశ్వరన్ మరణించాడా అన్న విషయాన్ని ఇంకా తేల్చలేదు.






