ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లు ప్రత్యక్షం.. పండగ చేసుకుంటున్న జనం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-08 06:25:49  IST  )

మార్కెట్‌లో నాటు కోడి మాంసం కావాలంటే.. మటన్‌తో సమానంగా రేటు చెల్లించాల్సిందే.

ఆ ఊళ్లో 2 వేల నాటు కోళ్లు ప్రత్యక్షం.. పండగ చేసుకుంటున్న జనం
X

దిశ, వెబ్‌డెస్క్: మార్కెట్‌లో నాటు కోడి మాంసం కావాలంటే.. మటన్‌తో సమానంగా రేటు చెల్లించాల్సిందే. ఆ కూరకు అంత క్రేజ్ మరి. అయితే, తాజాగా హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో వింత ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిత్యం రద్దీగా ఉండే సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇవాళ 2 వేలకు పైగా నాటుకోళ్లను రోడ్డుపై వదిలి వెళ్లిపోయారు. అయితే, ఆ కోళ్లన్నీ సమీపంలో ఉన్న పొలాల్లోకి మేతకు వెళ్లాయి. దీంతో గమనించిన రైతులు ఆ కోళ్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని ఆరా తీయగా.. ఎవరో రోడ్డుపై వదిలి వెళ్లినట్లుగా గుర్తించారు. ఇంకేముంది వాటిని ఎంచక్కా.. పట్టేసి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. విషయం ఈ నోట.. ఆ నోట పాకడంతో ఎల్కతుర్తి గ్రామస్థులు నాటు కోళ్ల వేటలో నిమగ్నమై ఒక్కొక్కరు రెండు, మూడు చొప్పున కోళ్లను పట్టుకుని ఇళ్లకు తీసుకెళ్తున్నారు.

Next Story