సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్‌ డౌన్.. విషయం తెలిసి అధికారులు షాక్

by Kema Shiva Kumar |

రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఓ ప్రోటోకాల్ (Protocol) వ్యవస్థ ఉంటుంది.

సీఎం కాన్వాయ్‌లోని 19 కార్లు ఒకేసారి బ్రేక్‌ డౌన్.. విషయం తెలిసి అధికారులు షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ఓ ప్రోటోకాల్ (Protocol) వ్యవస్థ ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా.. వెంట పదుల సంఖ్యలో కాన్వాయ్‌తో పాటు ఓ జామర్ వెహికల్, అంబులెన్స్ ఉంటుంది. సెక్యూరిటీలో ఎక్కడ ఎలాంటి చిన్న పొరపాటు జరిగినా.. సీఎం ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. గురువారం రాత్రి సీఎం మోహన్ యాదవ్ (CM Mohan Yadav) అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాత్లామ్ (Ratlam) వెళ్తుండగా.. కాన్వాయ్‌లోని 19 టయోటా ఎక్స్‌యూవీ (Toyota XUV) కార్లు ఒకటి తరువాత మరొకటి నడిరోడ్డుపై ఆగిపోయాయి.

ఈ హఠాత్పరిణామంతో అధికారులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు ఏం జరగుతుందో తెలియక కంగారుపడ్డారు. అధికారుల్లో ఒకరు అంతకు ముందు కార్లలో కొట్టించిన డీజిల్‌పై అనుమానం వ్యక్తం చేశాడు. నేరుగా సదరు బంక్ వద్దకు వెళ్లి ఓ బాటిల్‌‌లో డీజిల్ కొట్టి చూడగా.. సగానికిపైగా నీళ్లు పైకి తేలాయి. దీంతో డీజిల్ కల్తీ కారణంగా కార్లు ఆగిపోయాయని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అప్పటికప్పుడు సీఎం మోహన్ యాదవ్‌కు ఆల్టర్‌నేట్ కాన్వాయ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపించేశారు. అనంతరం సీఎం కాన్వాయ్ కార్లలో డీజిల్ కొట్టిన బంక్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సీఎంవో (CMO) అధికారులు కలెక్టర్‌తో పాటు తూనికలు, కొలతల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Next Story