- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొంపముంచిన సోషల్ మీడియా.. నగరంలో ఏకంగా 150 పెళ్లిళ్లు క్యాన్సిల్
వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలన్నది నానుడి. కానీ.. అందులో ఒక్క నిజం తెలిసినా పెళ్లి ఆగిపోతుంది. ముక్కు, ముఖం పరిచయం లేని ...

దిశ, వెబ్‌డెస్క్: వెయ్యి అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలన్నది నానుడి. కానీ.. అందులో ఒక్క నిజం తెలిసినా పెళ్లి ఆగిపోతుంది. ముక్కు, ముఖం పరిచయం లేని కుటుంబాలు ఈ పెళ్లితోనే బంధుత్వంగా మారుతాయి. కానీ.. ఇటీవల ఓ నగరంలో సోషల్ మీడియా కారణంగా జంటల మధ్య మనస్పర్థలు రావడంతో 40 రోజుల్లో 150కి పైగా పెళ్లిళ్లు రద్దయ్యాయి. మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఈ ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
చిన్నపిల్లల నుంచి పండుముసలి వరకూ సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. అవసరం లేకపోయినా ఆ మత్తులో మునిగి తేలుతున్నారు. ఈ సోషల్ మీడియానే పెళ్లి చేసుకునే జంటల పాలిట శాపంగా మారింది. సోషల్ మీడియాలో వధువు లేదా వరుడు చేసిన పోస్టులే అందుకు కారణం కావడం గమనార్హం.
ఇటీవల ఇండోర్ - గుజరాత్ కు చెందిన జంట ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుకుంది. ఈ షూట్ ను అమ్మాయి తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆపై ఆ గొడవ చిలికి చిలికి గాలి వానలా మారడంతో మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నారు. 60-70 శాతం పెళ్లిళ్లు ఓల్డ్ ఫ్రెండ్స్ కు సంబంధించిన పోస్టులు చేయడం, గతంలో చేసిన పోస్టులు కారణంగా రద్దయ్యాయని ఓ హిందీ దినపత్రిక నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. దీంతో పెళ్లి కావలసిన యువతీ యువకులు జాగ్రత్త పడుతున్నారు. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కు సంబంధించిన పోస్టుల్ని డిలీట్ చేస్తున్నారు.






