103 ఏళ్ల బామ్మ.. మేకప్‌ బ్రష్‌ చేతబట్టి ప్రపంచాన్నే ఫిదా చేస్తోందిగా..!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-01 06:46:28  IST  )

మన అమ్మమ్మలు, నాన్నమ్మలతో ఉండటం ఓ సంతోషకరమైన అనుభవం.

103 ఏళ్ల బామ్మ.. మేకప్‌ బ్రష్‌ చేతబట్టి ప్రపంచాన్నే ఫిదా చేస్తోందిగా..!
X

దిశ, వెబ్ డెస్క్: మన అమ్మమ్మలు, నాన్నమ్మలతో ఉండటం ఓ సంతోషకరమైన అనుభవం. వాళ్లకున్న అనుభవాలు, వాళ్లు చెప్పే కథలు, చేతి వంటలు.. అన్నీ మనకు చిన్ననాటి నుంచి తెలుసు. కానీ వాళ్లకూ ఫ్యాషన్‌, టెక్నాలజీ, సోషల్‌ మీడియా మీద అంతే ఆసక్తి ఉందంటే నమ్మగలరా? వంట చేయడం, కథలు చెప్పడం, పుస్తకాలు చదవడం మాత్రమే కాదు.. సోషల్‌ మీడియాను శాసించే టాలెంట్‌ కూడా వాళ్లకు ఉందని నిరూపించింది ఇంగ్లండ్‌కు చెందిన జోన్‌ పార్ట్‌రిడ్జ్‌. ఈమె వయసు ఏకంగా 103 ఏళ్లు! టిక్‌టాక్‌లో రోజూ హాస్యాస్పదమైన మేకప్‌ ట్యూటోరియల్స్‌తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది.

ఇంగ్లండ్‌కు చెందిన ఈ జోన్‌ పార్ట్‌రిడ్జ్‌ అనే 103 ఏళ్ల బామ్మ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సెన్సెషన్‌గా మారింది. ఆమె చేసే మేకప్‌ ట్యూటోరియల్స్‌ టిక్‌టాక్‌లో లక్షలాది మంది చూసి ఆశ్చర్యపోతున్నారు. మేకప్‌ బ్రష్‌ పట్టుకొని తన ప్రత్యేకమైన స్టైల్‌లో బ్యూటీ టిప్స్‌ చెప్తుంది. 'బ్లష్‌ వేయాలంటే నవ్వుతూ వేయమంటారు, కానీ నేను నవ్వితే ముడతలే కనిపిస్తాయి' అనే డైలాగ్‌తో ఈ బామ్మ మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ ఒక్కటే కాదు, ఆమె చెప్పే ప్రతి మాటలోనూ చమత్కారం దాగి ఉంటుంది. అందుకే సుమారు రెండున్నర లక్షల మంది ఆమెను ఫాలో అవుతున్నారు.

బామ్మ టెక్నిక్స్‌ చూసి కొంతమంది మేకప్‌ పద్ధతులు నేర్చుకుంటే, మరికొందరు ఆమె హాస్యాన్ని ఆస్వాదిస్తున్నారు. టిక్‌టాక్‌ ద్వారా ఫేమస్‌ అయిన ఈ బామ్మని ఇంటర్వ్యూకు పలు టీవీ చానళ్లూ, అంతర్జాతీయ మీడియా సంస్థలూ రప్పిస్తున్నారు. ఆమె వీడియోల్లో చూపిన మేకప్‌ ఐటమ్స్‌ను చూసి ఫాలోవర్స్‌ వాటిని తయారు చేసే బ్రాండ్స్‌ను ట్యాగ్‌ చేయడంతో, ఆ బ్రాండ్స్‌ బామ్మకి గిఫ్ట్‌ హ్యాంపర్లు పంపించాయి. దీంతో జోన్‌ పార్ట్‌రిడ్జ్‌ ఇప్పుడు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా మారింది. వందేళ్ల వయసులోనూ ఆమె టిక్‌టాక్‌ స్టార్‌ మాత్రమే కాకుండా, బ్యూటీ గురువుగా, మేకప్‌ మెంటర్‌గా ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది.

Next Story