టెస్లా కారా మజాకా.. 1000 కేజీల బండ రాయి వేసినా!

by velandi.Saikiran |

ఇండియన్ మార్కెట్లో అనేక రకాల కార్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్లలో 5 స్టార్ రేటింగ్ తో పాటు... ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్

టెస్లా కారా మజాకా.. 1000 కేజీల బండ రాయి వేసినా!
X

వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లో అనేక రకాల కార్లు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కార్లలో 5 స్టార్ రేటింగ్ తో పాటు... ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు కూడా ఉంటాయి. జనాలు.. కొంతమంది పికప్ ఉన్న వెహికల్స్ కొంటారు. ఇలాంటి నేపథ్యంలోనే టెస్లా కార్లు కూడా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ టెస్లా కార్లు చాలా దృఢంగా ఉండటమే కాకుండా... అధునాతన టెక్నాలజీతో నడుస్తాయి.

ఈ టెస్లా కార్లకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలోనే... తాజాగా టెస్లా కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఓ 1000 కేజీల బండరాయిని టెస్లా కారుపై జెసిబి సహాయంతో వేశారు. అయితే 1000 కేజీల బండరాయి సాధారణ కార్లపై వేస్తే... అది తుక్కుతుక్కు అవుతుంది. కానీ ఇక్కడ టెస్లా కారు మాత్రం... అలా కాదు. 1000 కేజీల బండరాయి వేసిన చెక్కుచెదరలేదు.

ఆ బండరాయి టెస్లా కారు పైన పడటంతో.. వెంటనే జారి కింద పడింది తప్ప కారుకు మాత్రం డ్యామేజ్ కాలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్... షాక్ అవుతున్నారు. ఇదేంట్రా ఇలా ఉంది... బండరాయి కంటే బలంగా ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా... టెస్లా కారు ఇండియాలోకి ప్రవేశించింది. సూరత్ కు చెందిన ప్రముఖ బిజినెస్ మాన్ దాలియా... టెస్లా సైబర్ ట్రక్ ను కొనుగోలు చేశారు. ఈ కారు సూరత్ రోడ్లపై తిరిగి సందడి చేసిన సంగతి తెలిసిందే.

Next Story