IRCTC Shirdi Tour :షిర్డీ, నాసిక్ టూర్.. ప్యాకేజీ వివరాలు ఇవే!

by Disha Web Desk 17 |
IRCTC Shirdi Tour :షిర్డీ, నాసిక్ టూర్.. ప్యాకేజీ వివరాలు ఇవే!
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవి సెలవుల్లో ఫ్యామిలీ మొత్తం ఎక్కడికైన ఆధ్యాత్మిక టూర్ వేయాలనుకుంటున్న వారికి కొత్తగా ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) స్పెషల్ ప్యాకేజీ ని తీసుకొచ్చింది. దీనిలో భాగంగా షిర్డీ, నాసిక్, త్రయంబకేశ్వర్ దర్శించే అవకాశాన్ని IRCTC అందిస్తుంది. ఈ టూర్ 3 రాత్రులు, 4 రోజుల పాటు సాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ నుంచి యాత్ర సాగుతుంది. జూన్ 2 న టూర్ అందుబాటులో ఉంటుంది. యాత్ర గురించి పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.


* మొదటి రోజు(శుక్రవారం) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 6:50 గంటలకు రైలు నెం. 17064, అజంతా ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా జర్నీ చేస్తారు.

* రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి షిర్డీలోని హోటల్‌కి వెళ్తారు. తరువాత నడక ద్వారా ఆలయానికి చేరుకుని షిర్డీ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం సమయంలో యాత్రికులు కావాలనుకుంటే శనిసింగనాపూర్‌కు వెళ్లి రావచ్చు. ఆ రోజు రాత్రి షిర్డీలో బస చేయాల్సి ఉంటుంది.

* మూడోరోజు షిర్డీ హోటల్ నుంచి నాసిక్ (90 కి.మీ.)కి బయలుదేరుతారు. అక్కడ త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత నాసిక్‌లోని పంచవటి దర్శనం ఉంటుంది. లోకల్‌గా ఉండే కొన్ని ప్రదేశాలను చూశాక, సాయంత్రం నాగర్‌సోల్ స్టేషన్‌లో సాయంత్రం 8:30 గంటలకు డ్రాప్ చేస్తారు. అక్కడ రాత్రి 9.20 గంటలకు రైలు నెం.17063లో తిరిగి జర్నీ ప్రారంభమవుతుంది. ఆ రోజు రాత్రంతా ప్రయాణం చేస్తారు.

* నాలుగో రోజు సోమవారం ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.


ఈ ప్యాకేజీలో స్టాండర్డ్ క్లాస్‌, కంఫర్ట్ క్లాస్ అనే ఆప్షన్స్ ఉంటాయి.

టూర్ ధరల వివరాలు:

కంఫర్ట్ క్లాస్:

సింగిల్ షేరింగ్: రూ.13,420.

ట్విన్ షేరింగ్: రూ.8,230

ట్రిపుల్ షేరింగ్: రూ.6,590

స్టాండర్డ్ క్లాస్‌:

సింగిల్ షేరింగ్: రూ.11,730.

ట్విన్ షేరింగ్: రూ.6,550

ట్రిపుల్ షేరింగ్: రూ.4,910


ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణ చార్జ్‌లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఉదయం రెండు రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్ కవర్ అవుతాయి. ప్యాకేజీలో లేనివి.. రైళ్లో భోజన ఖర్చులు, మధ్యాహ్నం భోజనం, దర్శనీయ ప్రదేశాల వద్ద టికెట్ చార్జీలు, గైడ్ తదితర ఖర్చులను ప్రయాణికులే భరించాలి.


Next Story

Most Viewed