IRCTC స్పెషల్ ప్యాకేజీ: తక్కువ ధరలో మంగళూరు, శృంగేరి, ఉడిపి చూసే ఛాన్స్

by Harish |

కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా..? ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే మీకోసమే ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) కొత్తగా ఒక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

IRCTC స్పెషల్ ప్యాకేజీ: తక్కువ ధరలో మంగళూరు, శృంగేరి, ఉడిపి చూసే ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కొత్త ప్రదేశాలను చూడాలని ఉందా..? ఎక్కడికి వెళ్లాలి, ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తున్నారా..? అయితే మీకోసమే ఇండియన్ రైల్వే కాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) కొత్తగా ఒక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం ‘DIVINE KARNATAKA(డివైన్ కర్ణాటక)’ పేరిట ధర్మస్థల, మంగళూరు, శృంగేరి, ఉడిపి మొదలగు ప్రాంతాలను చూసే అవకాశం ఇస్తుంది.

ఈ టూర్ 5 రాత్రులు, 6 పగలు సాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి టూర్ మొదలవుతుంది. రాబోయే టూర్ తేదీ 18, జులై, 2023న ప్రారంభమవుతుంది. ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారు IRCTC టూరిజం ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భాగంగా IRCTC వారు అన్ని ఏర్పాట్లు చేస్తారు.

డివైన్ కర్ణాటక టూర్ పూర్తి వివరాలు

* మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు 5.30 గంటల వరకు చేరుకోవాలి. రైలు నం.12789, కాచిగూడ - మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్‌లో టూర్ మొదలవుతుంది. 6:05 గంటలకు రైలు బయలుదేరుతుంది. ఆ రోజంతా జర్నీ చేస్తారు.

* రెండో రోజు 9:30 గంటలకు మంగళూరు సెంట్రల్ చేరుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఉడిపికి బయలుదేరుతారు. అక్కడ ముందే బుక్ చేసిన హోటల్‌కు చేరుకుని కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, సెయింట్ మేరీస్ ద్వీపం, మాల్పే బీచ్ సందర్శిస్తారు. తిరిగి సాయంత్రం హోటల్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి ఉడిపిలో బస చేస్తారు.

* మూడో రోజు ఉదయం శ్రీకృష్ణ దేవాలయాన్ని సందర్శిస్తారు. తర్వాత హోటల్ చెక్ అవుట్ చేసి శృంగేరికి బయలుదేరుతారు. అక్కడ శారదాంబ ఆలయాన్ని చూశాక, మంగుళూరు వెళ్తారు. ఆ రాత్రి మంగుళూరులో బస చేస్తారు.

* నాలుగో రోజు మంజునాథ ఆలయాన్ని సందర్శించేందుకు ఉదయం ధర్మ స్థలానికి బయలుదేరారు. ఆ తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్తారు. సాయంత్రం తిరిగి మంగళూరు చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు.

* ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ చేసి, మంగళూరు స్థానిక సందర్శనా స్థలాలు అయిన (పిలికుల నిసర్ఘధామ, మంగళ దేవి ఆలయం, కటీల్ ఆలయం, తన్నీర్బావి బీచ్) సందర్శిస్తారు. ఆ రాత్రి 7 గంటలకు మంగళూరు సెంట్రల్‌లో డ్రాప్ చేస్తారు. రైలు నం. 12790లో 8:05 గంటలకు తిరిగి జర్నీ ప్రారంభమవుతుంది, ఓవర్ నైట్ జర్నీ చేస్తారు.

* ఆరో రోజు రాత్రి 11.40 గంటలకు కాచిగూడ స్టేషన్ చేరుకుంటారు. దీంతో టూర్ పూర్తవుతుంది.

టూర్ ధరల వివరాలు

ప్యాకేజీలో భాగంగా కంఫర్ట్, స్టాండర్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి.

కంఫర్ట్ క్లాస్

సింగిల్ షేరింగ్: రూ.33,170.

ట్విన్ షేరింగ్: రూ.19,820.

ట్రిపుల్ షేరింగ్: రూ.16,320.


స్టాండర్డ్ క్లాస్‌:

సింగిల్ షేరింగ్: రూ.30,170.

ట్విన్ షేరింగ్: రూ.16,820.

ట్రిపుల్ షేరింగ్: రూ.13,320.

ప్యాకేజీలో భాగంగా రైలు ప్రయాణ చార్జ్‌లు, ట్రావెల్ ఇన్సూరెన్స్, AC హోటల్, ఉదయం 3 రోజుల పాటు బ్రేక్‌ఫాస్ట్ కవర్ అవుతాయి. ప్యాకేజీలో లేనివి.. రైళ్లో భోజన ఖర్చులు, మధ్యాహ్నం భోజనం, దర్శనీయ ప్రదేశాల వద్ద టికెట్ చార్జీలు, గైడ్ తదితర ఖర్చులను ప్రయాణికులే భరించాలి.

Next Story