చీరె కొంగుతో రాష్ట్రపతికి దిష్టితీసి.. పద్మ అవార్డ్ తీసుకున్న ట్రాన్స్‌జెండర్ మంజమ్మ

by Vadlamudi Anukaran |   (  Updated:2021-11-10 01:10:32  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతికి ట్రాన్స్ జెండర్ దిష్టి తీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పద్మ అవార్డ్ గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేశారు. కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన ట్రాన్స్ జెండర్ మంజమ్మ జోగతి కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఆమెకు రాష్ట్రపతి ఆ అవార్డును ప్రదానం చేశారు. పద్మ అవార్డును తీసుకున్న క్రమంలో ఆమె మొదటగా [&hellip;]</p>

Rastrapathi-Ramnath-Kovindh
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రపతికి ట్రాన్స్ జెండర్ దిష్టి తీసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పద్మ అవార్డ్ గ్రహీతలకు అవార్డులను ప్రదానం చేశారు. కర్ణాటక జానపద అకాడమీకి అధ్యక్షురాలిగా పనిచేసిన ట్రాన్స్ జెండర్ మంజమ్మ జోగతి కూడా పద్మశ్రీ అవార్డుకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో ఆమెకు రాష్ట్రపతి ఆ అవార్డును ప్రదానం చేశారు. పద్మ అవార్డును తీసుకున్న క్రమంలో ఆమె మొదటగా తన చీరె కొంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసింది. ఆ తర్వాత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ మంజమ్మను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు.

Next Story