- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింగరేణిలో మళ్ళీ బదిలీలు
<p>దిశ,బెల్లంపల్లి : పరి పాలనలో భాగంగా సింగరేణి సివిల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేస్తూ గురువారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది. రామగుండం రీజియన్ 2లో సివిల్ విభాగం డిప్యూటీ జి.ఎం. సిహెచ్ రామకృష్ణకు పదోన్నతి కల్పిస్తూ రామగుండం 3 ఏరియాకు జనరల్ మేనేజర్‌గా, రామగుండం 3ఏరియాలోని డి. శ్రీనివాసులును డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా మందమర్రి ఏరియాకు, ఇల్లందు ఏరియాలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న వి. రవి కుమార్ ను […]</p>

దిశ,బెల్లంపల్లి : పరి పాలనలో భాగంగా సింగరేణి సివిల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధికారులను బదిలీ చేస్తూ గురువారం సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులను జారీ చేసింది. రామగుండం రీజియన్ 2లో సివిల్ విభాగం డిప్యూటీ జి.ఎం. సిహెచ్ రామకృష్ణకు పదోన్నతి కల్పిస్తూ రామగుండం 3 ఏరియాకు జనరల్ మేనేజర్‌గా, రామగుండం 3ఏరియాలోని డి. శ్రీనివాసులును డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా మందమర్రి ఏరియాకు, ఇల్లందు ఏరియాలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న వి. రవి కుమార్ ను సత్తుపల్లి ఏరియాకు, సత్తుపల్లి ఏరియా లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న జి. ధనుంజయను రామగుండం రీజియన్ 2 ఏరియాకు బదిలీ చేశారు.

వీరినే కాకుండా కార్పొరేట్ లో సివిల్ జనరల్ మేనేజర్ గా నిర్వహిస్తున్న ఆదినారాయణను ఇల్లందు ఏరియాకు జనరల్ మేనేజర్ గా , కార్పొరేట్ లో సివిల్ జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న అచ్యుతరామయ్య ను భూపాలపల్లి ఏరియాకు జనరల్ మేనేజర్ గా, ఇల్లందు ఏరియాలో విధులు నిర్వహిస్తున్న ఎల్. సరితను కార్పొరేట్ లో జనరల్ మేనేజర్ గా పదోన్నతి కల్పిస్తూ, సత్తుపల్లి ఏరియా లో విధులు నిర్వహిస్తున్న ఎం ఎస్ ఆర్ కె. ప్రసాద్ ను క్వాలిటీ కంట్రోల్ బెల్లంపల్లి ఏరియా తోపాటు సత్తుపల్లి ఏరియాలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. బదిలీ అయిన సివిల్ విభాగానికి చెందిన అధికారులు ఆయాస్థానాలలోని సంబంధిత ఏరియాల జనరల్ మేనేజర్లకు విధులలో చేరేందుకు రిపోర్టు చేయాలని ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది.






