- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ
<p>దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాలో డీఎఫ్ వోగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. పీ. సుతాన్ను డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పోస్టింగ్ ఇచ్చి ములుగులోని తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు డీన్‌గా నియమించింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎఫ్ డీవోగా విధులు నిర్వర్తిస్తున్న పెట్ల రాజశేఖర్‌ను ఆదిలాబాద్ డీఎఫ్ వోగా నియమిస్తూ బదిలీ చేస్తున్నట్లు సీఎస్ సోమేశ్ […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రభుత్వం ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ జిల్లాలో డీఎఫ్ వోగా విధులు నిర్వర్తిస్తున్న ఎస్. పీ. సుతాన్ను డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌గా పోస్టింగ్ ఇచ్చి ములుగులోని తెలంగాణ ఫారెస్ట్ కాలేజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు డీన్‌గా నియమించింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎఫ్ డీవోగా విధులు నిర్వర్తిస్తున్న పెట్ల రాజశేఖర్‌ను ఆదిలాబాద్ డీఎఫ్ వోగా నియమిస్తూ బదిలీ చేస్తున్నట్లు సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి డివిజన్లో ఎఫ్ డీవోగా విధులు నిర్వర్తిస్తున్న భూక్య లావణ్యను జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీఎఫ్ వోగా, ములుగు జిల్లాలో ఎఫ్ డీవో గా ఉన్న బోగ నిఖితను కామారెడ్డి డీఎఫ్ వోగా బదిలీచేశారు. డాక్టర్ మర్రిచెన్నారెడ్డి హెచ్ ఆర్డీ ఇనిస్టిట్యూట్‌లో స్పెషల్ ఫౌండేషన్ కోర్స్ చేస్తున్న వికాస్ మీనాను నిర్మల్ జిల్లా డీఎఫ్ వో గా నియమించారు.






