నలుగురు అడిషనల్ ఎస్పీల బదిలీ

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి నలుగురు అడిషనల్ ఎస్పీలను బదిలీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా పి. శోభన్ కుమార్ ను బదిలీ చేసింది. ఆయన ఇప్పటి వరకు రామగుండం అడిషనల్‌ డీసీపీ(ఆపరేషన్స్‌)గా విధులు నిర్వర్తిస్తున్నారు. వరంగల్‌, అడిషనల్‌ డీసీపీ(క్రైమ్స్‌, ఆపరేషన్స్‌)గా పనిచేస్తున్న వి. తిరుపతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా బదిలీ అయ్యారు. జయశంకర్‌ భూపాలపల్లి అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా పనిచేస్తున్న కె. సురేశ్‌ కుమార్‌ను, భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్‌ [&hellip;]</p>

నలుగురు అడిషనల్ ఎస్పీల బదిలీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం బుధవారం రాత్రి నలుగురు అడిషనల్ ఎస్పీలను బదిలీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా పి. శోభన్ కుమార్ ను బదిలీ చేసింది. ఆయన ఇప్పటి వరకు రామగుండం అడిషనల్‌ డీసీపీ(ఆపరేషన్స్‌)గా విధులు నిర్వర్తిస్తున్నారు. వరంగల్‌, అడిషనల్‌ డీసీపీ(క్రైమ్స్‌, ఆపరేషన్స్‌)గా పనిచేస్తున్న వి. తిరుపతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా బదిలీ అయ్యారు. జయశంకర్‌ భూపాలపల్లి అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా పనిచేస్తున్న కె. సురేశ్‌ కుమార్‌ను, భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్‌ ఎస్పీ(ఆపరేషన్స్‌)గా ఉన్న అట్లా రమణారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story