- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్వే ప్రయాణికులకు షాక్.. ఆ రైళ్లు రద్దు
<p>దిశ, వెబ్‌డెస్క్ : భారీ వర్షాలతో అటు తమిళనాడు ఇటు ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాలలో వరదల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. దాని నుంచి కోలుకోకముందే ఏపీని సైక్లోన్ తుఫాన్ భయపెడుతోంది. ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. డిసెంబర్ 3న ఇది తుఫాన్‌గా మారనుందని దీనికి జవాద్ గా నామకరణం చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : భారీ వర్షాలతో అటు తమిళనాడు ఇటు ఏపీ అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాలలో వరదల కారణంగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగింది. దాని నుంచి కోలుకోకముందే ఏపీని సైక్లోన్ తుఫాన్ భయపెడుతోంది. ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. డిసెంబర్ 3న ఇది తుఫాన్‌గా మారనుందని దీనికి జవాద్ గా నామకరణం చేసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాన్ హెచ్చరికతో తూర్పు కోస్తా రైల్వే అప్రమత్తం అయ్యింది. నేటి నుంచి మూడు రోజుల పాటు 95 రైళ్లను రద్దు చేశారు.
Next Story






