స్కిల్​ డెవలప్మెంట్‌పై 10లక్షల మందికి శిక్షణ

by  |
స్కిల్​ డెవలప్మెంట్‌పై 10లక్షల మందికి శిక్షణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్‌లో 10లక్షల మంది యువతకు స్కిల్​ డెవలప్మెంట్‌పై శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్​ అండ్ నాలెడ్జ్(టాస్క్), స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మైక్రోసాఫ్ట్, నాస్కాం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ‘మార్చ్​ టు మిలియన్’ అనే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సంస్థల ప్రతినిధులు గురువారం సంతకాలు చేశారు. 2021వరకు ఈ మేరకు కార్యక్రమాన్ని పూర్తి చేసే లక్ష్య సాధన దిశగా అడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీ జయేష్​ రంజన్​ మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా స్కిల్​ డెవలప్మెంట్​ ప్రోగ్రాం అమలుకు ముందుకొచ్చిన నాస్కాం, మైక్రోసాఫ్ట్​ సంస్థలను అభినందించారు. సాంకేతిక విప్లవంలో విద్యార్ధులు భాగస్వాములు కావాలన్నారు. ప్రపంచ స్థాయి సంస్థల్లో పని చేయగల సామర్ధ్యం తెలంగాణ యువతకు రావాలని అభిలాషించారు.

Next Story

Most Viewed