వాటిని ట్రాయ్ రద్దు చేసింది!

by  |
వాటిని ట్రాయ్ రద్దు చేసింది!
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్‌టెక్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు అందిస్తున్న ప్రీమియం ప్లాన్‌లను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) రద్దు చేసింది. భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన ప్లాటినం, వొడాఫోన్ ఐడియాకు చెందిన రెడ్ఎక్స్ ప్రీమియం ప్లాన్‌లను ట్రాయ్ బ్లాక్ చేసింది. వీటిని పొందే వినియోగదారులకు ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా అత్యధిక వేగవంతమైన డేటా, ప్రయారిటీ సేవలను అందిస్తున్నాయి. అంతేకాకుండా కస్టమర్ కేర్ సేవలు కూడా ప్రత్యేకంగా అందిస్తున్నాయి. కాగా, ఈ రకమైన ప్రీమియం ప్లాన్‌ల కారణంగా సాధారణ వినియోగదారులు, ఈ ప్లాన్ తీసుకోని వారికి ఎక్కువ నష్టం కలుగుతుందని ట్రాయ్ అభిప్రాయపడింది. ఈ కారణంతోనే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ప్రీమియం ప్లాన్‌లను రద్దు చేస్తున్నామని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు స్పందించే వీలు లేకుండా రద్దు చేయడం షాక్‌ను కలిగించిందని కంపెనీల వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ ప్లాన్‌ల వల్ల నాణ్యతా లోపాలు, నెట్ న్యూట్రాలిటీ నిబంధనలను ఉల్లంఘించే అవకాశాలు ఎక్కువున్నందున రద్దు చేశామని ట్రాయ్ వివరించింది. కాగా, ఎయిర్‌టెల్ ఇటీవలే ‘ప్రియారిటీ 4జీ నెట్‌వర్క్’ పేరుతో రూ. 499 కంటే ఎక్కువ పోస్ట్ పెయిడ్ మొబైల్ కస్టమర్లను ప్లాటినం కస్టమర్లుగా గుర్తిస్తామని తెలిపింది. కాల్ సెంటర్లలో ప్రత్యేక కస్టమర్ కేర్ సర్వీసులను అందిస్తామని పేర్కొంది. వొడాఫోన్ ఐడియా సైతం రెడ్ఎక్స్ పేరున అచ్చు ఇలాంటి సేవలనే అందిస్తోంది.


Next Story