- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నల్లగొండ జిల్లాలో విషాదం
by Shyam |
<p>దిశ, నల్లగొండ: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు అన్నదమ్ముల్లో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న వాగులో పడి అన్న మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం ధన్సింగ్తండాలో సోమవారం ఇద్దరు అన్నదమ్ములు ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్న వాగులో ప్రమాదవశాత్తు పడిపోయిన హరిలాల్(అన్నయ్య) ఊపిరాడక మృతిచెందాడు. తన అన్నయ్య కనిపించట్లేదని చిన్నవాడైన సాయికుమార్ కూడా వాగులోకి చూడగా.. తాను మునిగిపోయాడు. అప్పటికే పిల్లల కోసం వెతుకుతున్న […]</p>

X
దిశ, నల్లగొండ: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి వద్ద ఆడుకుంటున్న ఇద్దరు అన్నదమ్ముల్లో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న వాగులో పడి అన్న మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా తిరుమలగిరిసాగర్ మండలం ధన్సింగ్తండాలో సోమవారం ఇద్దరు అన్నదమ్ములు ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. ఈ సమయంలో పక్కనే ఉన్న వాగులో ప్రమాదవశాత్తు పడిపోయిన హరిలాల్(అన్నయ్య) ఊపిరాడక మృతిచెందాడు. తన అన్నయ్య కనిపించట్లేదని చిన్నవాడైన సాయికుమార్ కూడా వాగులోకి చూడగా.. తాను మునిగిపోయాడు. అప్పటికే పిల్లల కోసం వెతుకుతున్న తల్లిదండ్రులు నీటిలో వాళ్లిద్దరినీ గమనించి.. ఇద్దరినీ బయటకు తీశారు. అప్పటికే హరిలాల్ మృతిచెందగా.. సాయికుమార్ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. చికిత్స నిమిత్తం అతడిని నార్కట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.
Next Story






