సౌండ్ పొల్యూషన్ చేస్తే క్రిమినల్ కేసులు

by  |
సౌండ్ పొల్యూషన్ చేస్తే క్రిమినల్ కేసులు
X

దిశ, క్రైమ్ బ్యూరో: నగరంలో సౌండ్ పొల్యూషన్‌కు పాల్పడుతున్న వాహనదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ హెచ్చరించారు. సైలెన్సెర్లు మార్చుతూ.. నగర వాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 17 వరకూ రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా బంజారాహిల్స్ కేబీఆర్ పార్కు వద్ద శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ అడిషనల్ సీపీ అనిల్ కుమార్ మాట్లాడుతూ… ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం 65 డిసిబుల్‌కు మించి సౌండ్ ఉంటే.. నోయిస్ పొల్యూషన్ అవుతోందన్నారు.

కానీ, మన దగ్గర టూవీలర్ల యాజమానులు అత్యధికంగా కంపెనీ నుంచి వచ్చిన సైలెన్సెర్లను మార్చుతూ సౌండ్ పొల్యూషన్‌కు పాల్పడుతున్నారని అన్నారు. దీని వల్ల వాయి కాలుష్యంతో పాటు ధ్వని కాలుష్యం వస్తోందన్నారు. సౌండ్ పొల్యూషన్ కారణంగా చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా హైపర్ టెన్షన్, హార్ట్ ఎటాక్, ఆందోళన లాంటి వ్యాధులకు గురవుతామని అన్నారు. అంతేగాకుండా, నగరంలో పలు ఆస్పత్రులు, పాఠశాలల్లోని చిన్నారులతో పాటు నగర వాసుల్లో చికారు (హెరిటేషన్) కలుగుతోందన్నారు. ఈ ఏడాది జనవరిలో నోయిస్ పొల్యూషన్‌కు పాల్పడిన వాహనదారులపై 1134 కేసులు నమోదు చేశామన్నారు.



Next Story