నల్లబ్యాడ్జీలతో టీపీటీఎఫ్ నేతల నిరసన

by Shyam |   (  Updated:2020-04-05 07:35:24  IST  )

<p>దిశ, మెదక్: అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రొఫెసర్ ఆనంద్ తెల్ తుంబ్డే‌ను విడుదల చేయాలని టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట ఉపాధ్యాయ భవన్ ఎదుట ఆదివారం టి.పి.టి.ఎఫ్ నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ఆనంద్ తెల్ తుంబ్డేను అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రొఫెసర్ తెల్ తుంబ్డే ప్రజా హక్కుల కోసం పోరాడే నాయకుడన్నారు. ఆయనపై ‘ఉపా’ చట్టం కింద కేసు [&hellip;]</p>

నల్లబ్యాడ్జీలతో టీపీటీఎఫ్ నేతల నిరసన
X

దిశ, మెదక్: అఖిల భారత విద్యాహక్కు వేదిక జాతీయ కార్యవర్గ సభ్యుడు ప్రొఫెసర్ ఆనంద్ తెల్ తుంబ్డే‌ను విడుదల చేయాలని టి.పి.టి.ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.తిరుపతిరెడ్డి డిమాండ్ చేశారు. సిద్దిపేట ఉపాధ్యాయ భవన్ ఎదుట ఆదివారం టి.పి.టి.ఎఫ్ నేతలు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ఆనంద్ తెల్ తుంబ్డేను అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రొఫెసర్ తెల్ తుంబ్డే ప్రజా హక్కుల కోసం పోరాడే నాయకుడన్నారు. ఆయనపై ‘ఉపా’ చట్టం కింద కేసు నమోదుచేయడం, మావోయిస్టు సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించడం అన్యాయమన్నారు. నిరసన కార్యక్రమంలో టి.పి.టి.ఎఫ్ కార్యదర్శి ఎస్ .కనకయ్య ,జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.రాములు, సిహెచ్ .విజయేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

tag; prof Anand Tell Teltumbde arrest issue, tptf members protest, ts news

Next Story