TRS పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం : TPTF

by  |
TRS పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం : TPTF
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థను నిరసిస్తూ తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (TPTF)హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా విజయవంతమైంది. ఈ సందర్బంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.రవీందర్ మాట్లాడుతూ.. గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రతీ ఏడాది బడ్జెట్లో విద్యారంగానికి నిధుల కేటాయింపుల్లో కోతలు పెడుతోందని, అరకొర వసతులతో, ఉపాధ్యాయ సిబ్బంది లేమితో ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయ్యేలా చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండున్నర ఏళ్ల కిందట నియమించిన త్రిసభ్య కమిటీ PRC రిపోర్టు నేటికి రాలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి PRC ని వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. ప్రమోషన్ల ద్వారా ఉపాధ్యాయ మరియు విద్యా పర్యవేక్షకుల ఖాళీలు నింపి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చూడాలన్నారు. ధర్నా అనంతరం కార్యాలయ పరిపాలన అధికారి సీతారాములు (AO)కు మెమోరాండం ఇచ్చినట్లు తెలిపారు.


Next Story

Most Viewed