బ్రేకింగ్.. రేవంత్ ఇంటి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. టీపీసీసీ చీఫ్ అరెస్ట్ (వీడియో)

by Vadlamudi Anukaran |   (  Updated:2021-12-27 03:20:59  IST  )

<p>దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి వద్ద కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యాక్రమం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎర్రవల్లికి వెళ్లనున్నట్లు రేవంత్ ఆదివారం ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తయ్యారు. సోమవారం ఉదయం నుంచే రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రేవంత్ ఇంటి నుంచి బయటకు రావడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో [&hellip;]</p>

బ్రేకింగ్.. రేవంత్ ఇంటి వద్ద పోలీసుల ఓవరాక్షన్.. టీపీసీసీ చీఫ్ అరెస్ట్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లి వద్ద కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యాక్రమం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎర్రవల్లికి వెళ్లనున్నట్లు రేవంత్ ఆదివారం ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తయ్యారు.

సోమవారం ఉదయం నుంచే రేవంత్ రెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు రేవంత్ ఇంటి నుంచి బయటకు రావడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Next Story