- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నర్మెటలో బొమ్మ తుపాకీ కలకలం
by Vadlamudi Anukaran |
<p>దిశ, హుస్నాబాద్: సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన ఓ యువకుని వద్ద బొమ్మ తుపాకీ దొరకడంతో మండలంలో కలకలం రేగింది. మండలంలోని దుబ్బా తండా పరిధిలోని పంచారయితం తండాకు చెందిన యువకుడు హైదరాబాద్ లో పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆ యువకుడు హైదరాబాద్ నుండి ఇంటికి వస్తుండగా నర్మెట మండలం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. యువకుడి బ్యాగులో బొమ్మ తుపాకీ లభ్యమైంది. దీంతో ఆ పోలీసులు అక్కన్నపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో […]</p>

X
దిశ, హుస్నాబాద్: సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట మండలానికి చెందిన ఓ యువకుని వద్ద బొమ్మ తుపాకీ దొరకడంతో మండలంలో కలకలం రేగింది. మండలంలోని దుబ్బా తండా పరిధిలోని పంచారయితం తండాకు చెందిన యువకుడు హైదరాబాద్ లో పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆ యువకుడు హైదరాబాద్ నుండి ఇంటికి వస్తుండగా నర్మెట మండలం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. యువకుడి బ్యాగులో బొమ్మ తుపాకీ లభ్యమైంది. దీంతో ఆ పోలీసులు అక్కన్నపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు.
గతంలో అక్కన్నపేట మండలంలో మేకలు కాసే వ్యక్తి దగ్గర తుపాకీ దొరికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అదే కోణంలో పోలీసులు విచారణ చేశారు. ఆ యువకుడు తమ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల కోసం తుపాకీ బొమ్మ కొన్నానని చెప్పినట్లు సమాచారం.
Next Story






