- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దాడికి పాల్పడ్డ టూరిజం డిప్యూటీ మేనేజర్ సస్పెండ్
<p>దిశ, ఏపీ బ్యూరో: మాస్కు పెట్టుకోవాలని సూచించినందుకు తోటి ఉద్యోగినిపై విచక్షణా రహితంగా దాడి చేసిన అధికారి ఎట్టకేలకు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే… నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ఉషారాణి, కరోనా నేపథ్యంలో మాస్కు పెట్టుకోవాలని పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావుకి సూచించారు. దీంతో ఆగ్రహించిన ఆయన ఉషారాణిపై విచక్షణారహితంగా దాడి చేశారు. జుట్టు పట్టకుని కుర్చీలో నుంచి కింద పడేసి.. కుర్చీ హ్యాండిల్‌తో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. అడ్డుకున్న […]</p>

దిశ, ఏపీ బ్యూరో: మాస్కు పెట్టుకోవాలని సూచించినందుకు తోటి ఉద్యోగినిపై విచక్షణా రహితంగా దాడి చేసిన అధికారి ఎట్టకేలకు సస్పెండ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే… నెల్లూరులోని ఏపీ టూరిజం కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగి ఉషారాణి, కరోనా నేపథ్యంలో మాస్కు పెట్టుకోవాలని పర్యాటకశాఖ డిప్యూటీ మేనేజర్ భాస్కర్ రావుకి సూచించారు. దీంతో ఆగ్రహించిన ఆయన ఉషారాణిపై విచక్షణారహితంగా దాడి చేశారు. జుట్టు పట్టకుని కుర్చీలో నుంచి కింద పడేసి.. కుర్చీ హ్యాండిల్‌తో ఇష్టమొచ్చినట్టు కొట్టారు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 27న జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. మహిళా ఉద్యోగి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు భాస్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు.






