‘ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సంతోషించే విషయం‌’

by Shyam |   (  Updated:2021-02-08 06:43:06  IST  )

<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం ఎంతో సంతోషించే విషయమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేయడంపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అపర భగీరథుడులా పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ పాలనలో ప్రజలంతా [&hellip;]</p>

‘ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సంతోషించే విషయం‌’
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు తీసుకురావడం ఎంతో సంతోషించే విషయమని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేయడంపై సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అపర భగీరథుడులా పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు.

కేసీఆర్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన ఈ రిజర్వేషన్ల వల్ల రాష్ట్రంలోని ఆర్యవైశ్యులతో పాటు రెడ్డి సామాజిక వర్గం, వెలమ, క్షత్రియ, బ్రాహ్మణ, కమ్మ సామాజిక వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ కులాల్లో ఉన్న పేద విద్యార్థులందరికీ కాలేజీలలో సీట్లలో, ఉద్యోగాలలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ రిజర్వేషన్లు తెచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.

Next Story