- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడెక్కడి RMP డాక్టర్‌రా బాబు.. వైద్యం పేరుతో మహిళను ఎక్కడపడితే అక్కడ తాకుతూ..
<p>దిశ, నాగర్ కర్నూల్ : నేటి సమాజంలో నీతినియమాలు మచ్చుకకు కూడా కనిపించకుండా పోతున్నాయనే దానికి నిదర్శనం ఈ RMP డాక్టర్ చేసిన పని. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ 33 ఏళ్ల మహిళ గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించగా, మద్యం మత్తులో కామంతో కళ్ళు మూసుకొని మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలో వెలుగుచూసింది. బాధితురాలు కథనం ప్రకారం.. బుధవారం రాత్రి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ […]</p>

దిశ, నాగర్ కర్నూల్ : నేటి సమాజంలో నీతినియమాలు మచ్చుకకు కూడా కనిపించకుండా పోతున్నాయనే దానికి నిదర్శనం ఈ RMP డాక్టర్ చేసిన పని. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ 33 ఏళ్ల మహిళ గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించగా, మద్యం మత్తులో కామంతో కళ్ళు మూసుకొని మహిళపై అత్యాచార యత్నానికి ఒడిగట్టాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని పెంట్లవెల్లి మండల కేంద్రంలో వెలుగుచూసింది. బాధితురాలు కథనం ప్రకారం.. బుధవారం రాత్రి తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతూ మండల కేంద్రంలోని ఆర్ఎంపీ మల్లయ్య నిర్వహించే గౌరీ క్లినిక్ బాధితురాలు వెళ్ళింది.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆర్ఎంపీ కడుపు నొప్పి వైద్యం అందిస్తున్న సాకుతో మహిళను ఎక్కడ పడితే అక్కడ తాకుతూ తనను అత్యాచారయత్నానికి పాల్పడినట్లు ఆరోపించింది. అక్కడే ఉన్న వారి కుటుంబ సభ్యులు, భర్త ప్రతిఘటించి ఇదేంటని అడిగే ప్రయత్నం చేయగా సంబంధిత ఆర్ఎంపీ పెప్పర్ స్ప్రేతో దాడి చేశాడని ఆందోళన వ్యక్తం చేశారు. తనతో పాటు గ్రామంలోని ఎంతోమంది ఆసుపత్రికి వైద్యం కోసం వస్తుంటారని, ఇతడిని ఇలాగే వదిలేస్తే వయసులో ఉన్న యువతులపై కూడా ఇలాగే ప్రవర్తిస్తాడని, తనకు జరిగిన విధంగా మరెవరికీ జరగొద్దని ఆవేదన వ్యక్తం చేసింది.
ఛీ ఛీ.. నీచం.. పానీపూరీ నీటిలో మూత్రం కలిపి………..
దీనికి నిరసనగా గురువారం ఆర్ఎంపీ గౌరీ క్లినిక్ ను మూసేయాలని డిమాండ్ చేస్తూ, తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేక ఆసుపత్రి ముందే పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. దీన్ని అడ్డుకున్న మహిళా సంఘాల సభ్యులు బాధితురాలికి మద్దతుగా ఆసుపత్రి ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శివ శంకర్ తెలిపారు. ఇది ఇలా ఉండగా పాత కక్షలను మనసులో పెట్టుకొని ఇలా చేశారని సంబంధిత ఆర్ఎంపీ వైద్యుడు చెప్పుకోవడం గమనార్హం.






