మెదక్ జిల్లాకు మొత్తం 49 వైన్స్ షాపులు..

by  |
మెదక్ జిల్లాకు మొత్తం 49 వైన్స్ షాపులు..
X

దిశ, మెదక్ : న్యూ ఎక్సైజ్ పాలసీ ద్వారా రిటైల్ మద్యం దుకాణాల ఎంపికను జిల్లా కలెక్టరేట్‌‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమక్షంలో సోమవారం నిర్వహించారు. ఈ విధానంలో ఏజెన్సీ ప్రాంతాలలోని గిరిజనులకు రిజర్వు అయిన వాటితో పాటు ఇతరులకు మరో 5 శాతం, ఎస్సీలకు 10, గౌడ్స్‌కు 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అందుకనుగుణంగా దుకాణాల కేటాయింపుల కోసం కమిటీ సభ్యులైన జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమాధికారి, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సయిజ్ అధికారి సమక్షంలో జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీవో సాయి రామ్‌లు లాటరీ పద్ధతి ద్వారా దుకాణాలను ఎంపిక చేశారు. జిల్లాలో మొత్తం 49 వైన్ షాపులకు గాను ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు 30 శాతం రిజర్వేషన్‌ వర్తింపజేయనున్నారు.

ఇందులో 16 దుకాణాలు రొటేషన్ (సైకిల్ సిస్టం ) పద్దతిలో ఎస్టీ, ఎస్సీ, గౌడ్‌లకు వరుసగా లాటరీ ప్రకారం దుకాణాలు కేటాయించారు. 2019-21 వరకు అమలులో ఉన్న ఆబ్కారీ విధానం గత నెలలో ముగియగా ప్రభుత్వం ఈనెల వరకు లైసెన్స్ పొడిగించింది. దుకాణాల కేటాయింపులు ఇలా ఎస్టీ -1, ఎస్సీ -6, గౌడ్స్- 9 దుకాణాలను కేటాయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, ఆర్డీవో, సాయిరామ్, ఆబ్కారీ సూపరింటెండెంట్ రజాక్, డీఎస్డీవో విజయలక్ష్మీ, బీసీ అభివృద్ధి అధికారి జగదీశ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి నారాయణ్ రెడ్డి, ఆబ్కారీ శాఖా సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed