ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో  ఖాళీగా 41,177 పోస్టులు!

by  |
Nirmala sitharaman
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొత్తం 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మంజూరు చేసిన మొత్తం పోస్టుల్లో ఇవి 5 శాతానికి సమానమని చెప్పారు. ఈ బ్యాంకుల్లో మొత్తం 8.05,986 ఉద్యోగాలను మంజూరు చేశారు. ప్రస్తుతం ఎస్‌బీఐలో అత్యధికంగా 8,544 ఖాళీలు ఉన్నాయన్నారు. లోక్‌సభలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతున్న అంశం గురించి అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

డిసెంబర్ 1వ తేదీ నాటికి కేటాయించిన మొత్తం బ్యాంకు పోస్టుల్లో 95 శాతం భార్తీ అయ్యాయన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేటాయించిన మొత్తంలో కేవలం 41,177 మాత్రమే ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ ఖాళీలు ప్రభుత్వం రంగ బ్యాంకుల్లోని సబ్‌స్టాఫ్, ఆఫీసర్, క్లర్క్ విభాగాల్లో ఉన్నాయి. ఎస్‌బీఐ తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంకులో 6,743, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6,295, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో 5,112, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4,848 ఖాళీలు ఉన్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. గడిచిన ఆరు సంవత్సరాల్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో ఒక పోస్టు తగ్గించామని పేర్కొన్నారు. బ్యాంకులు ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా నియామకాలను చేపడుతున్నాయని ఆర్థిక మంత్రి వెల్లడించారు.


Next Story

Most Viewed