సింగరేణిని వణికిస్తున్న భూకంపాలు.. నాలుగేళ్లలోనే ఆరుసార్లు

by Harish SP |   (  Updated:2025-05-05 16:14:46  IST  )

సింగరేణి ప్రాంతంలో వరుసగా చోటుచేసుకుంటున్న భూకంపాలు ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

సింగరేణిని వణికిస్తున్న భూకంపాలు.. నాలుగేళ్లలోనే ఆరుసార్లు
X

దిశ, వెబ్ డెస్క్: సింగరేణిని వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. తాజాగా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలాన్ని భూకంప కేంద్రంగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ గుర్తించింది. రిక్టర్ స్కేల్ పై 3.8 మాగ్నిట్యూడ్ అని పేర్కొన్నది. భూమికి 10 కి.మీ. లోతున ప్రకంపనలు వచ్చినట్టు తెలిపింది. నిజానికి 10కిలోమీటర్ల లోతు అనేది చాలా తీవ్రమైనది.. రిక్టర్ స్కేల్ పై 5దాటితే అది అత్యంత విషాదాన్ని మిగిల్చే ప్రమాదం ఉన్నది. అయితే, నాలుగేళ్లలోనే ఈ ప్రాంతానికి సమీపంలోనే ఆరు చోట్ల భూకంపాలు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పైగా ఇవన్నీ రెబ్బెనకు 100కిలోమీటర్ల పరిధిలోపే ఉండటం గమనించవచ్చు. బ్రిటిష్ హయాం నుంచి బొగ్గు ఖనిజం కోసం ఈ ప్రాంతంలో చాలాకాలంపాటు అండర్ మైనింగ్ జరిగింది. ఆ తర్వాత ఓపెన్ మైనింగ్ చేపడుతున్నారు. కానీ, చాలా అండర్ మైన్స్ లో నిబంధనల ప్రకారం గనులను ఇసుకతో పూడ్చారా? లేదా? అని నేటికీ చాలామందిలో సందేహాలు ఉన్నాయి. అయితే, ఇటీవల వరుసగా సంభవిస్తున్న భూకంపాలతో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల్లో అనేక భయాందోళనలు మొదలయ్యాయి. అధికారులు తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనడంతోపాటు ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం, భూకంప సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. అదేసమయంలో భారీ భవనాల విషయంలో నిబంధనలు పటిష్ఠంగా అమలుచేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


గత నాలుగేళ్లలో వచ్చిన భూకంపాలు


1. 2024.02.11: మహారాష్ట్ర టోమ్టా ప్రాంతం

రిక్టర్ స్కేల్: 3.2 మాగ్నిట్యూడ్

లోతు: 10కి.మీ.

2. 2023. 03.21: దహెగాం, ఆసిఫాబాద్ జిల్లా

రిక్టర్ స్కేల్: 3.1 మాగ్నిట్యూడ్

లోతు: 5కి.మీ.

3. 2021.10.23: ఇందారం, మంచిర్యాల

రిక్టర్ స్కేల్: 3.6 మాగ్నిట్యూడ్

లోతు: 5కి.మీ.

4. 2022.10.12: పరందోళి, ఆదిలాబాద్

రిక్టర్ స్కేల్: 2.7 మాగ్నిట్యూడ్

లోతు: 10కి.మీ.

5. 2021.10.31: అల్గావ్, మంచిర్యాల

రిక్టర్ స్కేల్: 4 మాగ్నిట్యూడ్

లోతు: 10కి.మీ.


Next Story